E-Paper
Advertisement

మిక్సర్ గ్రైడర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!

మిక్సర్ గ్రైడర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!
Advertisement

Mixer Grinder Under 3000: ప్రతి ఒక్కరి కిచెన్‌‌లో మిక్సర్ గ్రాండర్ అనేది కచ్చితంగా ఉండాల్సిన గాడ్జెట్! ఉదయాన్నే అల్లం-వెల్లుల్లి పేస్ట్ రుబ్బడం దగ్గర నుంచి గుమ గుమలాడే చట్నీల వరకు ప్రతి చిన్న పనికీ.. ఇది పక్కా సపోర్ట్ ఇస్తుంది. మీరు కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. నమ్మకమైన బ్రాండ్ కోసం వెతుకుతున్నారా? రూ.3,000 లోపు లభిస్తున్న క్రోమ్టన్, ఫిలిప్స్, బజాజ్ వంటి టాప్-5 బ్రాండ్ల బెస్ట్ మిక్సర్ గ్రాండర్లు వాటి పూర్తి వివరాలు, ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Bajaj Rex 500W Mixer Grinder:

ఇది ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ మిక్సర్. దీని పవర్ ఫుల్ 500-వాట్ల మోటార్ డైలీ వాడకానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు వస్తాయి. ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉండటం వల్ల మోటార్ కూడా త్వరగా పాడవకుండా ఉంటుంది.

Advertisement

ధర: సుమారు రూ.2,199

2. Crompton Ameo 750W Mixer Grinder:

Advertisement

ఎక్కువ పవర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌లో 750-వాట్ల పవర్ ఇవ్వడం దీని ప్రత్యేకత. ఇది గట్టి పిండి పదార్థాలను, మసాలాలను చాలా వేగంగా గ్రైండ్ చేస్తుంది. లీక్-ప్రూఫ్ క్యాప్స్, మోటార్ కూలింగ్ టెక్నాలజీ దీని సొంతం.

ధర:సుమారు రూ.2,799

3. Philips HL7505/00 500W Mixer Grinder:

క్వాలిటీకి మారుపేరైన ఫిలిప్స్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ చిన్న కుటుంబాలకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ప్రీమియం లుక్‌తో పాటు అద్భుతమైన బ్లెండింగ్, గ్రైండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది గ్లాసీ ఫినిషింగ్ కలిగి ఉండటంతో మీ కిచెన్ కు కూడా క్లాసీ లుక్ ఇస్తుంది.

ధర: సుమారు రూ. 2,495

4. Usha Rapidmix 500W:

దీనిలోని కాపర్ మోటార్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఉషా బ్రాండ్ దీని మోటార్‌పై ప్రత్యేక వారంటీ అందిస్తుంది. చక్కని డిజైన్, స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లతో వస్తున్న ఈ మిక్సర్ తక్కువ సౌండ్ తో పని చేస్తుంది.

ధర: సుమారు రూ.2,899

Also Read: రూ.571కే పవర్ బ్యాంక్..మ్యాగ్‌సేఫ్ ఫీచర్‌తో అదిరిపోయే ఆఫర్!

5. Crompton Ameo 500W:

రూ.2,000 లోపు బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్. 3 స్టెయిన్‌ లెస్ స్టీల్ జార్లు, షాక్ ప్రూఫ్ ABS బాడీ దీనిలో.. ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్ కావాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్. అంతే కాకుండా దీని ధర కూడా తక్కువ కాబట్టి బడ్జెట్ లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే మిక్సీ కొనాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ.1,899

మీ అవసరాలకు తగినట్లుగా తక్కువ ధరలో ఎక్కువ లైఫ్ ఇచ్చే మిక్సర్ గ్రాండర్‌ను కొనడం మంచిది. మీరు ఎక్కువగా మిక్సీ ఉపయోగించాల్సి వస్తే 750W మోడల్ ఎంచుకోవడం మంచిది. సాధారణ వంటలకైతే 500W సరి పోతుంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×