Glass door fridge:ప్రస్తుత కాలంలో ఇళ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మోడ్యులర్ కిచెన్‌ల ట్రెండ్ నడుస్తోంది. వంటగది అందంగా ఉంటే.. ఇంటికి సరికొత్త కళ వస్తుంది. అందుకే చాలామంది తమ కిచెన్‌ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రీమియం గాడ్జెట్లను ఎంచుకుంటున్నారు. అందులోనూ.. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ల విషయంలో ఇప్పుడు ‘గ్లాస్ డోర్’ డిజైన్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. సాధారణ మెటాలిక్ బాడీ ఫ్రిజ్‌ల స్థానంలో.. గ్లాస్ ఫినిషింగ్ ఉన్న ఫ్రిజ్‌లు కిచెన్‌కు ఒక రాయల్, లగ్జరీ లుక్‌ను ఇస్తున్నాయి.
ఈ గ్లాస్ డోర్ ఫ్రిజ్‌లు కేవలం చూడటానికి మాత్రమే అందంగా ఉండవు. వీటిలో లేటెస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ, మల్టీ-ఫ్లో కూలింగ్ సిస్టమ్, స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. మీ కిచెన్‌కు సరిగ్గా సరి పోయే టాప్-5 ప్రీమియం గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్లు , వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
శాంసంగ్ బ్రాండ్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.ఈ మోడల్ కర్వ్‌డ్ గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది మీ మోడ్యులర్ కిచెన్‌ను నెక్స్ట్ లెవెల్ లుక్‌లోకి మారుస్తుంది. దీనిలో స్పేస్‌మాక్స్ టెక్నాలజీ ఉండటం వల్ల లోపల చాలా ఎక్కువ స్టోరేజ్ లభిస్తుంది. వైఫై కనెక్టివిటీ, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్, పవర్ కూల్ ఆప్షన్ దీని ప్రత్యేకతలు. దీని ధర కూడా సుమారు రూ.85,000 నుంచి రూ.95,000 మధ్య ఉంటుంది.
ఎల్‌జీ బ్రాండ్ అందించే ఈ గ్లాస్ డోర్ ఫ్రిజ్ తన టెంపర్డ్ గ్లాస్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ ద్వారా ఫ్రిజ్ మూలలో ఉన్నా కూడా ఆహార పదార్థాలు తాజాగా ఉంటాయి. మల్టీ డిజిటల్ సెన్సార్లు, స్మార్ట్ థిన్క్యూ యాప్ సపోర్ట్, మన్నికైన గ్లాస్ బాడీ దీని ప్రత్యేకతలు.సుమారు రూ.78,000 నుంచి రూ. 88,000 మధ్య దీని ధర ఉంటుంది.
లేటెస్ట్ డిజైన్, అద్భుతమైన కూలింగ్ కోరుకునే.. వారికి వర్ల్‌పూల్ గ్లాస్ డోర్ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది తక్కువ కరెంట్ ఖర్చుతో అత్యధిక కూలింగ్ అందిస్తుంది. అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ.. ఆహారాన్ని ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. మ్యాజిక్ కూల్ జోన్, టెన్త్ జెనరేషన్ కంప్రెసర్, ప్రీమియం గ్లాస్ డోర్ ఫినిషింగ్ దీని ప్రత్యేకతలు. సుమారు రూ.65,000 నుంచి రూ.75,000 మధ్య దీని ధర ఉంటుంది.
స్టైలిష్ లుక్‌తో పాటు బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి హయర్ బెస్ట్ ఆప్షన్. దీని గ్లాస్ డోర్ డిజైన్ వేలిముద్రలు పడకుండా ఉంటుంది. కాబట్టి శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ.
సూపర్ కూలింగ్ మోడ్, ఎక్స్పర్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ, విశాలమైన వెజిటబుల్ బాక్స్ దీని ప్రత్యేకతలు సుమారు రూ.55,000 నుంచి రూ. 65,000 మధ్య దీని ధర ఉంటుంది.
Also Read: ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!
ఇండియన్ కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా గాడ్‍ప్రెజ్ ఈ మోడల్‌ను రూపొందించింది.ఇది క్యూట్, క్లాసీ గ్లాస్ లుక్‌తో మీ వంటగదికి ట్రెండీ వైబ్స్ ఇస్తుంది.దీని నానో షీల్డ్ టెక్నాలజీ బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది.ఎకో-మోడ్, ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. సుమారు రూ.50,000 నుంచి రూ.60,000 మధ్య దీని ధర ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్లు కేవలం కూలింగ్ మెషీన్లు మాత్రమే కావు, అవి మీ మోడ్యులర్ కిచెన్‌కు అందమైన ఇంటీరియర్ లుక్‌ను తెచ్చే అద్భుతమైన డిజైన్ ఆప్షన్లు.మీ బడ్జెట్,కిచెన్ స్పేస్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా మీ కిచెన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయెచ్చు.