Iftikhar Ahmeds English Trolls: పాకిస్తాన్ క్రికెటర్ల ఇంగ్లీష్ చాలా చెండాలంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒక్కడంటే ఒక్కడికి కూడా సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా, ట్రోలింగ్ కు గురి కావడం గ్యారెంటీ. నోటికి ఏది వస్తే, అదే వాగేస్తూ ఉంటారు. పరువు పోతుందనే భయంతో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇంగ్లీష్ లో క్లాసులు పీకుతారు. ఈ క్రమంలోనే అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఓ అమెరికా పిల్ల… అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ట్రోలింగ్ కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నేపాల్ ప్రీమియర్ లీగ్ మూడో ఎడిషన్ లో భాగంగా పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ జనక్పూర్ బోర్డ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ తరుణంలోనే ఇఫ్తికార్ అహ్మద్ ను ఓ అమెరికాకు సంబంధించిన అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అసలు మీరెవరు ? అని ఆమె ఇంగ్లీషులో ప్రశ్నించింది. అది అర్థం చేసుకోలేని ఇఫ్తికార్ అహ్మద్ నేను బాగానే ఉన్నానని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఇఫ్తికార్ అహ్మద్ ఇంగ్లీష్ పై దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత టీ20 క్రికెట్ ఆడే యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సందేశం ఇస్తారని ఆమె అడగగా… ఫిట్నెస్.. పర్ఫామెన్స్ అంటూ రెండు పదాలతో తప్పించుకున్నాడు. ఇక అతనికి ఇంగ్లీష్ రాదని గుర్తించిన ఆ అమ్మాయి… కూడా ఇంటర్వ్యూ ఆపేసింది. దీంతో సంఘటన వైరల్ గా మారింది.
నేపాల్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లందరూ ఖాట్మండు వచ్చారు. కానీ చివరి నిమిషంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రూల్ పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీని కోసం దాదాపు రూ.23 లక్షలు డిమాండ్ చేసింది. ఈ డబ్బులు కడితేనే ఎన్ఓసీ ఇస్తామని కండిషన్ పెట్టింది. అయితే ఆ డబ్బులు కట్టలేని పాకిస్తాన్ క్రికెటర్లు నేపాల్ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశారు. పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ ఈ టోర్నమెంట్ లో భాగంగా జనక్పూర్ బోల్డ్స్ ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. కానీ ఎన్వోసీ సమస్య రావడంతో ఇఫ్తికార్ అహ్మద్ కూడా నేపాల్ నుంచి పాకిస్తాన్ వచ్చేశాడు. దీంతో ఇఫ్తికార్ అహ్మద్ స్థానంలో బంగ్లాదేశ్ కు సంబంధించిన సైఫ్ హసన్ ఫర్వేజ్ హెస్సెన్ లను జట్టులోకి తీసుకున్నారు.
?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==