Medchal Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాను స్వయంగా నడుపుకుంటున్న సొంత ఆటో (నంబర్: AP 23 W 8413) అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందారు.
డ్రైవర్ కుమ్మరి శ్రీశైలం (35) దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీశైలంను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుడికి భార్య తేజారాణితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని అక్కడి స్థానికులు తెలిపారు. ప్రమాదనంతరం కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారనాలపై ఆరాతీయనున్నారు.
Also Read: ధరణి అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 9 మంది అరెస్ట్ కీలక నేతగా..?