Nalgonda Crime: తాగుడుకి బానిసైన కొడుకు కన్నతండ్రి పైనే గొడ్డలితో విరుచుకుపడ్డాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న ఒక్క కారణంతో పేగు బంధాన్ని మరచి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ పట్టణ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
డబ్బుల కోసం గొడవ.. ఆపై హత్య
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌నగర్‌కు చెందిన లింగయ్య(70) వద్దకు ఆయన కుమారుడు గణేశ్(35) శనివారం వెళ్లాడు. మద్యానికి డబ్బులు కావాలంటూ తండ్రిని నిలదీశాడు. అందుకు లింగయ్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయిన గణేశ్.. ఇంట్లోనే ఉన్న గొడ్డలి తీసుకొచ్చి కన్నతండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన లింగయ్య రక్తమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్.. సచివాలయంలో చంద్రబాబు అత్యవసర మీటింగ్!