Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 ఆడియన్స్ లో ఊహించని క్యూరియాసిటీ పెంచుతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఊహించని ఎలిమినేషన్స్, అటు కంటెస్టెంట్స్ తమ పవర్ ను ఉపయోగించి ఎలిమినేషన్ ను అడ్డుకోవడం అన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే వారం మొత్తం టాస్కులతో, గొడవలతో, రిలేషన్ షిప్స్ తో కొనసాగితే.. వీకెండ్స్ వచ్చేసరికి హోస్ట్ నాగార్జున (Nagarjuna) కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయట పెడుతూ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం, మంచిగా ఆట ఆడితే ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎనిమిదవ వారం వీకెండ్ వచ్చేసింది. 55వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తూ వారి తప్పొప్పులను బయటపెడుతూ కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేశారు.
తాజాగా విడుదల చేసిన 55వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోలో పోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ జోన్ లో ఉన్న సుధీర్ కి జీరో స్టార్ ఇస్తూ రెండు వారాలుగా రెడ్ లోనే ఉన్నావు.. అక్కడినుండి కనీసం ఎల్లోకి ఎందుకు రాలేకపోయావు అంటూ ప్రశ్నించాడు. సుధీర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. కారణాలు చెప్పకు.. ఈ వారం నీ ఆటకు నో స్టార్స్ అంటూ అసహనం వ్యక్తం చేశాడు నాగార్జున. ఇక ఝాన్సీ కి కూడా నో స్టార్ ఇవ్వడం గమనార్హం. నీ పవర్ ను మళ్లీ వాడుకొనే అవకాశం నీకు వచ్చింది. నువ్వు మనస్ఫూర్తిగా వాడావా? లేక ముఖేష్ అడిగాడని వాడావా? అంటూ ప్రశ్నించాడు. ఒక వీడియో చూపిస్తూ.. గేమ్ అర్థం కాలేదా? లేక ముఖేష్ తో ఆడినట్లు నరేష్ తో కూడా ఆడావా ?అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఆడితే రెడ్ లోనే ఉంటావు కూడా అంటూ హెచ్చరించాడు. అలాగే రామకృష్ణకి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
ALSO READ:‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!
అలాగే నీతూ మాస్టర్ కి జీరో స్టార్స్ ఇచ్చాడు..కోచ్ పని మానేసి ఎంపైర్ గా మారావా? అంటూ ప్రశ్నించాడు. బంధాలు బంధాలు అనుకుంటే మన దగ్గర స్టార్స్ మిగలవు. నువ్వు డాన్సర్ కాబట్టి బ్యాలెన్సింగ్ అద్భుతంగా చేస్తావనుకున్నాను. అవకాశం రాలేదు కానీ.. వచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు అంటూ ఆమెకి కూడా జీరో స్టార్స్ ఇచ్చాడు. అలా మొత్తానికైతే హౌస్ లో కంటెస్టెంట్స్ కు తనదైన శైలిలో చుక్కలు చూపిస్తూ.. తప్పొప్పులను బయట పెట్టాడు హోస్ట్ నాగార్జున.