Meghana Lokesh: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ చేస్తూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం వారిలో మేఘన లోకేష్ (Meghana Lokesh) ఒకరు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో శశిరేఖ పరిణయం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేఘన లోకేష్ అనంతరం కల్యాణ వైభోగమే, రక్తసంబంధం, కళ్యాణం కమనీయం, చామంతి వంటి తదితర సీరియల్స్ లో నటించి ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఇటీవల జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి(Chamanthi) సీరియల్ ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ఉన్నఫలంగా ఈ సీరియల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న చామంతి సీరియల్ నుంచి ఒక్కసారిగా మేఘన లోకేష్ తప్పుకుంటున్నట్టు తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు కానీ అసలైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇలా చామంతి సీరియల్ నుంచి మేఘన లోకేష్ తప్పుకోవడంతో ఈమె ఉన్నఫలంగా సీరియల్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణం ఏంటంటూ అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు.
ఈమె చామంతి సీరియల్ నుంచి తప్పుకున్న పలు ప్రమోషన్లలో భాగంగా నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నారు. అయితే మేఘన లోకేష్ తల్లి కాబోతున్న నేపథ్యంలోనే సీరియల్ నుంచి తప్పకున్నారని అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు.. అయితే ఈ సందేహాలు నిజమని తెలుస్తుంది. త్వరలోనే మేఘన లోకేష్ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా నవంబర్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అక్టోబర్ నెలలకు సంబంధించి కొన్ని పిక్స్ షేర్ చేశారు. ఇందులో భాగంగా తన బేబీ బంప్ (Baby Bump)ఫోటోలు క్లియర్ గా కనిపించడంతో ఈమె తల్లి కాబోతున్నారని స్పష్టమైంది.
ఇలా మేఘన లోకేష్ తన ప్రేగ్నెన్సీ (Pregnancy) విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించకపోయిన తన బేబీ బంప్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మేఘన లోకేష్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈమె బేబీ బంప్ చూస్తుంటే ఈ ఏడాది చివరిన లేదా వచ్చేయడాది మొదట్లోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారని స్పష్టమవుతుంది. ఈమె బేబీ బంప్ ఫోటోలు లీక్ అవడంతో ఈమె ప్రెగ్నెంట్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు మరి ఈ విషయాన్ని మేఘన ఎప్పుడు అధికారకంగా తెలియచేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?