E-Paper
Advertisement

గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్‌ఫోన్స్ ఇవే!

గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్‌ఫోన్స్ ఇవే!
Advertisement

Best Headphones: ఆడియో రంగంలో ‌బేయర్‌డైనమిక్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. తమ ప్రొడక్టుల గురించి పెద్దగా మార్కెటింగ్ చేయకపోయినా.. స్టూడియోలు, బ్రాడ్‌కాస్టింగ్, లైవ్ మ్యూజిక్‌లో ఈ బ్రాండ్‌కు మంచి పేరు ఉంది. ఇప్పుడు సాధారణ యూజర్ల నుంచి గేమర్స్, ఆడియోఫైల్స్, DJs వరకు అందరి అవసరాలకు తగ్గ హెడ్‌ఫోన్స్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 హెడ్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం.

Aventho 300

ట్రావెల్, రోజువారీ వినియోగానికి అవెంతో 300 మంచి ఎంపిక. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, డాల్బీ అట్మాస్, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. ANC ఆన్‌లో 50 గంటల వరకు బ్యాటరీ, ఆఫ్‌లో 60 గంటల వరకు బ్యాకప్ లభిస్తుంది. మ్యూజిక్, సినిమాలకు ఇది బాగా సరిపోతుంది.

MMX 230 Wireless

Advertisement

గేమింగ్ కోసం రూపొందించిన MMX 230 వైర్‌లెస్‌లో 2.4GHz వైర్‌లెస్, బ్లూటూత్ 6.0, ANC, మంచి బూమ్ మైక్ ఉన్నాయి. 60 గంటల బ్యాటరీతో ఎక్కువసేపు గేమింగ్ చేయొచ్చు. ఫుట్‌స్టెప్స్, రీలోడ్ సౌండ్స్ వంటి చిన్న ఆడియో వివరాలను కూడా స్పష్టంగా వినిపించేలా దీన్ని రూపొందించారు.

Also Read: టీవీ రిమోట్‌లోని ఈ బటన్‌ను చాలామంది వాడరు.. కానీ దీని పని తెలిస్తే షాక్ అవుతారు!

T1 3rd Generation

Advertisement

మ్యూజిక్‌ను చాలా వివరంగా వినాలనుకునే ఆడియోఫైల్స్ కోసం T1 థర్డ్ జనరేషన్. ఇది ఓపెన్ బ్యాక్, వైర్డ్ హెడ్‌ఫోన్. జర్మనీలో తయారయ్యే ఈ మోడల్ సహజమైన, డీటెయిల్డ్ సౌండ్ అందిస్తుంది. అయితే దీని పూర్తి సామర్థ్యాన్ని ఆస్వాదించడానికి మంచి DAC, హెడ్‌ఫోన్ యాంప్ అవసరం.

DJ 300 Pro X

DJs కోసం రూపొందించిన DJ 300 Pro X స్ట్రాంగ్ బాడీతో వస్తుంది. మార్చుకోగలిగే ఇయర్ ప్యాడ్స్, 45mm డ్రైవర్స్, 115 dB వరకు సౌండ్ లెవెల్ దీని ప్రత్యేకతలు. వైర్డ్ డిజైన్ కావడంతో బ్యాటరీ గురించి ఆందోళన అవసరం లేదు.

Amiron 300

ఎయిర్‌పాడ్స్ ప్రో, సోనీ WF సిరీస్‌కు పోటీగా అమిరాన్ 300 నిలుస్తుంది. ANC, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, LDAC, మల్టీపాయింట్ కనెక్షన్‌తో పాటు 10 గంటల ఇయర్‌బడ్స్ బ్యాటరీ లభిస్తుంది. మంచి వాయిస్ క్లారిటీ, మ్యూజిక్ డీటెయిల్స్ కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక.

Also Read: ఖరీదైన పవర్ బ్యాంక్ నిజంగా బెస్టేనా? డబ్బు ఖర్చుపెట్టే ముందు ఇవి తెలుసుకోండి!

Tags

Related News

రూ.1.30 లక్షల iPhone 17 Pro ఇప్పుడు రూ.80 వేల లోపే.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

ఫోన్ లేకుండానే టీవీలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. మెటా కొత్త ఫీచర్ ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

టెలికాం సంస్థలకు TRAI డెడ్‌లైన్.. 15 రోజుల్లో ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టకపోతే భారీ జరిమానా!

కళ్లుచెదిరే ట్రాన్స్‌పరెంట్ లుక్, 48 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీతో JBL Tune Buds 3 లాంచ్.. ధర ఎంతంటే?

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!

ఒకటి పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరొకటి కెమెరా కింగ్.. 2027లో వైడ్-స్క్రీన్ డిజైన్‌తో ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు!

Big Stories

Advertisement
×