E-Paper
Advertisement

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌
Advertisement

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో స‌మావేశ‌మైన‌వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్ర‌సీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గోవ‌ర్ధ‌న్, ఆర్ఎస్పీ నేత జాన‌కి రాములు తదితరులు ఉన్నారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నేత‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా వారు ప‌రిశీలించిన విష‌యాల‌ను సీఎం దృష్టికి వెళ్ల‌నున్నారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై తాము రూపొందిచిన నివేదిక‌ను సీఎంకు ఇవ్వ‌నున్నారు. ల‌గ‌చ‌ర్ల‌లో భూ సేక‌ర‌ణ అంశంపై చ‌ర్చించ‌నున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ఘ‌ట‌న‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి నివేదిక అందింది. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నివేదిక‌ను ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి, ఎంపీ మల్లు ర‌వి సీఎంకు అందించారు.

Advertisement

ఇదిలా ఉంటే ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. క‌లెక్ట‌ర్ పై కొంత‌మంది దాడి చేయ‌డంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఘ‌ట‌న వెన‌క బీఆర్ఎస్ నేత‌లు ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి హ‌స్తం ఉంద‌ని గుర్తించి, పోలీసులు ఆయ‌న‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. రైతుల‌ను రెచ్చ‌గొట్టి ల‌బ్ధిపొందేందుకు ప్ర‌య‌త్నించార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేసులో ప్ర‌ధాన నింధితుడుగా ఉన్న పంచాయితీ సెక్ర‌ట‌రీ పోలీసుల కంట ప‌డ‌కుండా త‌ప్పించుని, నేరుగా కోర్టుకు వెళ్ల‌డంపై అనుమానాలు వ‌స్తున్నాయి. ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ త‌ర‌వాత నిజానిజాలు బ‌య‌ట‌ప‌డ‌నున్నాయి.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×