Black Friday Sale 2024 : బ్లాక్ ఫ్రైడే సేల్.. అమెరికాలో ప్రారంభమైన ఈ సేల్ ప్రస్తుతం ఇండియాలో ఓ సెన్సేషన్ గా మారింది. ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్స్ అయిన అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, టాటా క్లిప్ తో పాటు మినిషోలో ఉండనుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ గ్యాడ్జెట్స్ తో పాటు ట్రెండీ ఫ్యాషన్ ప్రొడక్ట్స్, గృహ ఉపకరణాలు కొనేయాలంటే బ్లాక్ ఫ్రైడే సేల్ 2024పై ఓ లుక్కేయ్యాల్సిందే.
బ్లాక్ ఫ్రైడే సేల్ 2024.. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో అన్ని ప్రొడక్ట్స్ పై ఎప్పుడూలేనన్ని డిస్కౌంట్స్ ను ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని అందించనున్నాయి. ఇక ఈ సేల్ లో ఆఫర్స్ ఎలా ఉన్నాయి. ఎప్పటినుంచి ఎప్పటి వరకు సేల్ నడవనుంది అనే విషయాలతో పాటు డేట్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్, ఫ్లాట్ఫామ్స్ వంటి ఫుల్ డీటెయిల్స్ పై ఓ లుక్కేసేయండి.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు ఉండనుంది. ఇక టాటా క్లిప్ లో ఈ సేల్ నవంబర్ 26 నుంచి నవంబర్ 30 వరకు కొనసాగింది. ఇక మిగిలిన ఫ్లాట్ ఫామ్స్ మింత్రా, ఫ్లిప్కార్ట్, మినిషోలో ఈ సేల్ ఎప్పటి వరకు ఉంటుందో ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి వెల్లడించలేదు.
ఇక సేల్ ఏదైనా టాప్ బ్రాండ్ గాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ పై హై డిస్కౌంట్ ను ప్రకటించే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ లో టాప్ లేచిపోయే ఆఫర్స్ ఉన్నాయి.
Amazon Black friday Sale 2024
(అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024) –
ఎకో పాప్, ఎకో డాట్ (5వ తరం), ఫైర్ టీవీ పరికరాలపై గరిష్టంగా 55 శాతం తగ్గింపు
బీట్స్ హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లపై గరిష్టంగా 50 శాతం తగ్గింపు
HP, Lenovo, Acer ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు
Samsung Galaxy Budsపై 40 శాతం వరకూ తగ్గింపు
Tata Cliq Black friday Sale 2024
(టాటా క్లిక్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024) –
స్పీకర్లు, హెడ్‌ఫోన్‌లపై 80 శాతం వరకు తగ్గింపు
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై 45 శాతం వరకు తగ్గింపు
రూమ్ హీటర్లపై 60 శాతం వరకు తగ్గింపు
Samsung స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపు
Vivo స్మార్ట్‌ఫోన్‌లపై 25 శాతం వరకు తగ్గింపు
Black friday Sale 2024 Tips
(బ్లాక్ ఫ్రైడే సేల్ బెస్ట్ టిప్స్) –
ఫస్ట్ ప్రియారిటీ – కొన్ని డీల్స్ వేగంగా అమ్ముడవుతాయి. అందుకే కొనాలనుకుంటే ముందుగానే అన్నీ ఫ్లాట్ ఫామ్స్ ను తనిఖీ చేయటం మంచిది
విష్ లిస్ట్ – కావలసిన వాటిని ఓకేసారి విష్ లిస్ట్ లో ఉంచుకుంటే కొనుగోలు చేయటం తేలిక
ధరలు సరిపోల్చటం – ఇక బెస్ట్ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ ప్లాట్ఫార్మ్స్ లో వెతికి సరైన ధరకి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనడం అత్యవసరం
ఇక ఈ సేల్ లో అన్ని ఫ్లాట్ఫామ్స్ అత్యద్భుతమైన ఆఫర్స్ అందిస్తాయనే చెప్పాలి. అందుకే మీకు కావాలనుకునే గ్యాడ్జెట్స్ సొంతం చేసుకోవాలనుకుంటే త్వరగా కొనయండి
ALSO READ : దిమ్మతిరిగే ఫ్లిప్కార్ట్ ఆఫర్.. రూ.1000కే మెటో స్మార్ట్ ఫోన్.. ఎలా సొంతం చేసుకోవాలంటే!