Flipkart Offers : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు మొబైల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫెస్టివల్ సేల్స్ ను తీసుకొచ్చి కస్టమర్స్ ను ఖుషీ చేసిన ఫ్లిప్కార్ట్.. తాజాగా మొబైల్స్ బొనాంజా సేల్ ను తీసుకొచ్చింది. అయితే లేటెస్ట్ మొబైల్స్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ బెస్ట్ ఆప్షన్. ఇందులో హై క్వాలిటీ టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే ఆఫర్స్ నడుస్తున్నాయి. తక్కువ ధరకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఏ మొబైల్స్ పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.
ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనంజా సేల్లో అదిరిపోయే ఆఫర్స్ నడుస్తున్నాయి. రూ.15 వేలలోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక ఇందులో మోటారోలా జీ64 5G స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే కేవలం రూ.1000 కే ఈ ఫోన్ ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. నమ్మలేకపోతున్నారు కదా.. కానీ నిజం. మరి ఈ ఫోన్ ను తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలంటే..
మోటారోలా జీ64 5G స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ లో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB + 128GBతో లాంఛ్ కాగా.. కొద్ది రోజులకే మోటో ఈ మొబైల్ పై రూ.3000 అదనంగా పెంచేసింది. ప్రస్తుతం ఈ మొబైల్ ధర ఫ్లిప్కార్ట్ లో రూ. 17,999 గా ఉంది. అయితే మొబైల్ బోనంజా సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై 16% డిస్కౌంట్ అందిస్తుంది ఫ్లిప్కార్ట్. దీంతో ఈ మొబైల్ ను రూ.14099కే కొనే అవకాశం ఉంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే ఐదు శాతం అదనంగా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను సైతం ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ప్రస్తుతం ఉన్న మీ మొబైల్ పై పూర్తిగా ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తే కేవలం రూ.1000 రూపాయలకే ఈ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక ఇంకెందుకు ఆలస్యం మీ పాత ఫోన్ కండిషన్ బాగుంది మార్చేయాలి అనుకుంటే కచ్చితంగా ఫ్లిప్కార్ట్ సేల్ లో అమ్మేసి కొత్త ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయే విధంగా ఉన్నాయి. మోటరోలా జీ64 5జీ ఫోన్ 6.5 అంగుళాల FULL HD + ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్, 120 HZ రిఫ్రెష్ రేటుతో లాంఛ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14తో వచ్చేసింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 MP మెయిన్ కెమెరా + 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ తో వచ్చేసింది. ఈ మెుబైల్ లో సెల్ఫీల కోసం 16 MP కెమెరా ఉంది. ఇందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mah బ్యాటరీ ఉంది.
ALSO READ : ఫ్లిప్ ఫోన్ మార్కెట్లోకి మరో సరికొత్త మెుబైల్.. త్వరలోనే లాంఛ్ చేయబోతున్న వన్ ప్లస్