Black Friday Sale 2026: టెక్ లవర్స్‌కి ఇప్పుడు అసలైన మజా పంచే పండగ టైం వచ్చేసింది! ప్రతీ సంవత్సరం నవంబర్ చివరి వారంలో.. అంచనాలను తలకిందులు చేసేలా వచ్చే ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ (Black Friday Sale) కోసం గ్లోబల్ వైడ్‌గా అందరూ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కూడా అమెజాన్, ఫ్లిప్‌క్రాట్, యాపిల్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలు కస్టమర్లను కట్టిపడేసేందుకు సరి కొత్త ప్లాన్స్‌తో సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లు, ఐఫోన్లు, ఫ్లాగ్ షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఎన్నడూ లేని విధంగా భారీ తగ్గింపులు కన్ఫర్మ్ అయ్యాయి!
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘థాంక్స్ గివింగ్ డే’మరుసటి రోజున ఈ సేల్ లాంఛ్ అవుతుంది. ఈ ఏడాది అధికారిక.. బ్లాక్ ఫ్రైడే నవంబర్ 27న అట్ట హాసంగా ప్రారంభం కానుంది. అయితే. ఈ-కామర్స్ డిస్కౌంట్లు మాత్రం కస్టమర్ల ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని నవంబర్ మధ్య వారం నుంచే ‘ఎర్లీ బర్డ్ డీల్స్’పేరుతో డిస్కౌంట్‌లను స్టార్ట్ చేయడం విశేషం. ఈ ట్రెండీ సేల్ నవంబర్ చివరి వారం మొత్తం పీక్ స్టేజ్‌లో కొనసాగుతుంది.
ఐఫోన్‌లపై భారీ తగ్గింపులు:
యాపిల్ లవర్స్‌కి బ్లాక్ ఫ్రైడే సేల్ ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. లేటెస్ట్ ఐఫోన్ సిరీస్‌తో.. పాటు ప్రీవియస్ మోడల్స్‌పై ఊహించని స్థాయిలో.. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు తగలబోతున్నాయి.
iPhone 16 సిరీస్: ఈ సేల్‌లో.. ఐఫోన్ 16 మోడళ్లపై అట్రాక్టివ్‌గా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు తగ్గింపు లేదా బ్యాంక్ ఆఫర్లు దక్కే ఛాన్స్ ఉంది. మార్కెట్ అంచనాల ప్రకారం, బ్యాంక్ డిస్కౌంట్లు పోను మరింత బెస్ట్ ప్రైస్‌కి ఈ ఫోన్లు మీ సొంతం కావచ్చు.
iPhone 15 & 14: పాత మోడళ్లపై ఈ-కామర్స్ సైట్లు స్పెషల్ కూపన్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో మతి పోగొడుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.
ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు:
కేవలం ఐఫోన్లే కాకుండా.. మార్కెట్‌ను రూల్ చేస్తున్న ఆండ్రాయిడ్ బ్రాండ్లు కూడా ఈ సేల్‌లో తగ్గేదే లే అంటున్నాయి. శామ్‌సంగ్ , గూగుల్ పిక్సెల్ , వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై అదిరిపోయే ప్రైస్ కట్స్ కనిపిస్తున్నాయి.
Samsung Galaxy S సిరీస్: శామ్‌సంగ్ గెలాక్సీ ..ఎస్ సిరీస్ అల్ట్రా మోడళ్లపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డైరెక్ట్ ప్రైస్ కట్స్ ద్వారా దాదాపు రూ. 20,000 వరకు సేవింగ్స్ లభించే అవకాశం ఉందని టెక్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
Google Pixel ఫోన్లు: కెమెరా లవర్స్ ఫేవరెట్ అయిన గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ మోడళ్లపై బ్లాక్ ఫ్రైడే సేల్‌లో.. ఫ్లాట్ డిస్కౌంట్లు కన్ఫర్మ్‌గా ఉండనున్నాయి.
OnePlus & Xiaomi: టాప్-నాచ్ పర్ఫార్మెన్స్ కోరుకునేవారికి.. వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఆఫర్లతో సూపర్ రీజనబుల్ ప్రైస్‌కి అందుబాటులోకి రానున్నాయి.
Also Read: పవర్‌ఫుల్ పార్టీ స్పీకర్ వచ్చేసింది! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ప్రైస్ ట్రాకింగ్: సేల్ స్టార్ట్ కావడానికి.. ముందే మీకు నచ్చిన ఫోన్ ప్రైస్ హిస్టరీని ట్రాక్ చేయండి.
బ్యాంక్ ఆఫర్లు: క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ డిస్కౌంట్‌లను.. ముందు గానే చెక్ చేసుకోండి, ఎందుకంటే.. బిగ్గెస్ట్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫర్ల ద్వారానే వస్తాయి.
స్టాక్ లిమిట్: బ్లాక్ ఫ్రైడే డీల్స్ లిమిటెడ్ టైమ్ మాత్రమే.. ఉంటాయి కాబట్టి, డీల్ ఓపెన్ కాగానే లేట్ చేయకుండా..బుక్ చేసుకోవడం బెటర్.