BigTV English

New Smartphone: ఇదేం ఫోన్ రా సామీ.. రెండు డిస్‌ప్లేలు, 8800 mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త ఫోన్ రిలీజ్.. మామూలు అరాచకం కాదిది..!

New Smartphone: ఇదేం ఫోన్ రా సామీ.. రెండు డిస్‌ప్లేలు, 8800 mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త ఫోన్ రిలీజ్.. మామూలు అరాచకం కాదిది..!
Advertisement

Blackview Oscal Pilot 2: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌లో రిలీజ్ అయి స్మార్ట్‌ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లలు అప్డేటెడ్ వెర్షన్లతో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాయి. అయితే భారీ సామర్థ్యం గల బ్యాటరీ, ఫుల్ హెచ్ డీ ఫొటోలనిచ్చే కెమెరా గల ఫోన్‌ను కొనుక్కోవాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. మీ టెస్ట్‌కు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ బ్లాక్‌వ్యూ.. ‘ఓస్కల్ పైలట్ 2’ పేరుతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని డిజైన్ ఫోన్‌ను బలంగా, మన్నికైనదిగా చేస్తుంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 60 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఈ ఫోన్‌ను ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.

ఫోన్‌లో రెండు స్క్రీన్‌లు ఉండనున్నాయి. అంతేకాకుండా ఇందులో భారీ 8800 mAh బ్యాటరీ ఉంది. MediaTek G99 ప్రాసెసర్‌ని ఇందులో ఇన్‌స్టాల్ చేశారు. ఫోన్ ధర, అన్ని ప్రధాన ఫీచర్ల విషయానికొస్తే.. బ్లాక్‌వ్యూ ఓస్కల్ పైలట్ 2 స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఎంపికలలో ప్రారంభించబడింది. అవి ఆరెంజ్, బ్లాక్, గ్రీన్. దీని ధర $279.99 గా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ. 23,263గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.


Also Read: కిర్రాక్ 5జీ ఫోన్లు.. కేవలం రూ.12 వేల లోపే కొనేయొచ్చు.. ఫొటోలైతే ఓ రేంజ్‌లో వస్తాయ్..!

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికొస్తే.. Blackview Oscal Pilot 2 ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో మరొక డిస్‌ప్లే అందించబడింది. ఇది వెనుక వైపు పైభాగంలో గుండ్రంగా ఉంటుంది. దీని పరిమాణం 1.3 అంగుళాలు. నోటిఫికేషన్‌లను చూడటానికి ఇది ఉపయోగపడుతుంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ నీటిలో పడినా ఏమీ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా 1.2 మీటర్ల ఎత్తు నుండి పడిపోయినా విరిగిపోకుండా ఉంటుంది. MediaTek Helio G99 ప్రాసెసర్ బ్లాక్‌వ్యూ ఓస్కల్ పైలట్ 2లో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది 8 GB RAM + 256 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది 5G స్మార్ట్‌ఫోన్ కానప్పటికీ.

బ్లాక్‌వ్యూ ఓస్కల్ పైలట్ 2 స్మార్ట్‌ఫోన్ 8800 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని 45 వాట్ల వేగంతో ఛార్జ్ చేయవచ్చు. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది Samsung Isocell GN5 సెన్సార్‌తో ఫొటోలు తీస్తుంది. ఇందులో అల్ట్రా-వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది రెండు LED ఫ్లాష్ లైట్లను కలిగి ఉంది.

Tags

Related News

VIVO X90 Pro 2025: డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో X90 ప్రో లాంచ్,.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ కొనేయండి

Realme GT 8 Pro: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 320W ఛార్జింగ్.. ఫ్లాగ్‌షిప్ అనుభవంతో రియల్‌మీ GT 8 ప్రో.. ధర ఎంతంటే?

Realme Gaming Phone: రియల్ మి ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ.60 వేల ఫోన్ ఇప్పుడు రూ.42000కే

Smartphone Comparison: హానర్ మ్యాజిక్ 8 vs వన్‌ప్లస్ 13 vs గెలాక్సీ S25 5G.. ఏది బెస్ట్?

Motorola Moto G85 5G: 7800mAh బ్యాటరీ, 120డబ్య్లూ ఫాస్ట్ ఛార్జింగ్.. హై ఎండ్ ఫీచర్లతో మోటొ ఫోన్ బడ్జెట్ ధరలో..

Free Wifi Hacking: ఉచిత వైఫైతో ప్రమాదం… మీ ఫోన్, కంప్యూటర్ అంతా హ్యాక్.. ఈ జాగ్రత్తలు పాటించండి

Free TV Channels: ప్రపంచంలోని అన్ని టీవి ఛానెల్స్ ఫ్రీ.. మీ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ టీవి ఉచితం.. ఇలా చూసేయండి

Sudden Gamer Death: మొబైల్ గేమ్స్ ఆడుతూ చనిపోతున్న టీనేజర్లు.. ఏం జరుగుతోందంటే..

Big Stories

×