BigTV English

AP Assembly Election Results : పాపం.. జగన్ అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి..!

AP Assembly Election Results : పాపం.. జగన్ అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి..!

Jagan Mohan Reddy latest news(Andhra politics news): పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడోసారి అధికారం చేపట్టాలని, 400 టార్గెట్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూడా సత్తా చాటుతోంది. మధ్యాహ్నానికి ఎవరు విన్నరో, ఎవరు రన్నరో తేలిపోతుంది. అయితే, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. అక్కడ గెలిచేదెవరనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికున్న లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. దీంతో జగన్ పాచికలు పారలేదనే చర్చ మొదలైంది.


కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్

వై నాట్ 175 అంటూ ఎన్నికల సమయంలో జగన్ తెగ హడావుడి చేశారు. ఏ సభలో పాల్గొన్నా, ఏ సమావేశానికి వెళ్లినా కార్యకర్తలు, ప్రజలతో ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను సైతం ఓడిస్తామని ధీమాగా చెప్పారు. వైసీపీ శ్రేణులు కూడా అదే జరగాలని ఓటర్ దేవుడ్ని ప్రసన్నం చేసుకున్నారు. కానీ, వారి నుంచి వరం దక్కినట్టు కనిపించడం లేదు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అటు కుప్పంలో చంద్రబాబు, ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు.


కుప్పంపై స్పెషల్ ఫోకస్

కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. అయితే, 2019 ఎన్నికల్లో ఆయన ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో కుప్పంపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2020లో వైసీపీ నేత చంద్రమౌళి చనిపోవడంతో ఆయన కుమారుడు భరత్‌కు ఫుల్ హ్యాండ్ ఇచ్చి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జగన్. 2024లో ఎలాగైనా గెలవాలని అభివృద్ధి మంత్రం జపించారు. కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, ఆరు పోలీస్ స్టేషన్లతో సబ్ డివిజన్ ఏర్పాటు, నిధుల కేటాయింపు ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో ఈసారి పక్కాగా గెలుస్తామని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. కానీ, ఓట్ల లెక్కింపులో మాత్రం భరత్ వెనుకంజలో కనిపిస్తున్నారు.

పిఠాపురంలోనూ అంతే!

చంద్రబాబు తర్వాత జగన్ టార్గెట్ పవన్ కళ్యాణ్‌. పిఠాపురంలో వంగా గీత చేతిలో పవన్‌ను ఓడించాలని అన్ని ప్రయత్నాలూ చేశారు జగన్. కానీ, ఫలితాలు చూస్తుంటే ఆయన ప్లాన్స్ ఏవీ వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు జనసేనాని. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నేత పెండెం దొరబాబు గెలిచారు. టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీ చేశారు. 68,467 ఓట్లు సాధించారు. జనసేన తరఫున పోటీ చేసిన శేషుకుమారికి 28,011 ఓట్లు దక్కాయి. వైసీపీకి 83,459 ఓట్లు వచ్చాయి. కానీ, ఈసారి జనసేన, టీడీపీ కలిశాయి. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపితే వైసీపీ కంటే ఆధిక్యంగానే వచ్చాయి. దీంతో పవన్‌ను పక్కాగా ఓడించాలనుకున్న జగన్, కీలక నేతలను గ్రామానికి ఒకరి చొప్పున ప్రచారానికి దింపారు. చివరిలో వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించారు. కానీ, పవన్ హవా ముందు జగన్ పాచికలు పారలేదు. భారీ ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు జనసేనాని. అటు మంగళగిరిలో లోకేష్ కూడా ముందంజలో ఉన్నారు. అంతేకాదు, లీడింగ్‌లో ఎక్కువగా కూటమి అభ్యర్థులే ఉన్నారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×