Ban vs Pak: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) నేపథ్యంలో ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ… 9వ మ్యాచ్ జరగనుంది. రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో.. ఇవాళ నామమాత్రపు వన్డే మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Pakistan vs Bangladesh ) మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం…. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది.
Also Read: Afg vs Eng: 177 పరుగులతో రెచ్చిపోయి ఇబ్రహీం కొత్త చరిత్ర … ఇంగ్లాండ్ ముందు కొండంత టార్గెట్ ?
చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో ఇప్పటికే ఈ రెండు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. గ్రూప్ ఎ లో బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లు కూడా.. లీక్ దశలో రెండు మ్యాచులు…. ఆడి ఓడిపోయాయి. దీంతో ఒక్క పాయింట్ కూడా ఈ రెండు జట్లకు రాలేదు. ఈ తరుణంలోనే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యాయి. ఇక ఇవాళ ఈ రెండు జట్ల మధ్య ఫైట్ ఉండనుంది.
దీంతో తమ పరువు కాపాడుకునేందుకు రెండు జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే మాత్రం… అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోవడం ఖాయం. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్… గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయింది. దీంతో పాకిస్తాన్ టీం పైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో…ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ అయిన.. గెలవాలని పాకిస్తాన్ చూస్తోంది.
అటు బంగ్లాదేశ్ కూడా.. ఒక్క మ్యాచ్ అయిన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కసరత్తులు చేస్తోంది. ఇక ఇప్పటివరకు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 39 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో 34 మ్యాచ్లో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో.. బంగ్లాదేశ్ కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. అంటే.. ఈ రెండు జట్ల మధ్య 90% విజయం పాకిస్తాన్ సాధించిందని చెప్పవచ్చు. ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. అటు స్టార్ స్పోర్ట్స్ అలాగే స్పోర్ట్స్ 18 లో కూడా మ్యాచ్ చూడవచ్చు.
Also Read: RCB Fans In Pakistan: పాకిస్థాన్ లో RCB జపం.. ఈ సారైనా కప్ కొట్టాల్సిందే అంటూ ?
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల వివరాలు
పాకిస్థాన్ ప్రాబబుల్ XI: ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ రిజ్వాన్ (c & wk), సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రఫ్, కమ్రాన్ గులాం, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
బంగ్లాదేశ్ ప్రాబబుల్ XI: తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్), మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహ్మాన్