E-Paper
Advertisement

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!
Advertisement

BoAt Chrome Endeavour smartwatch: చేతికి లగ్జరీ లుక్ ఇస్తూనే.. మీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే ఒక అద్భుతమైన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఆడియో, వేరబుల్స్ బ్రాండ్ ‘బోట్’ మార్కెట్లోకి తీసుకువచ్చిన లేటెస్ట్ గాడ్జెట్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రీమియం మెటల్ బాడీ,  1.96- ఇంచుల అమెలోడ్ డిస్‌ప్లే , లేటెస్ట్ ‘ఏఐ కోచ్ ఫీచర్‌తో వస్తున్న బోట్ స్మార్ట్‌ వాచ్ ధర కేవలం రూ.4,299 మాత్రమే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఈ మోడల్ స్మార్ట్ వాచ్ కోసం యూత్ ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం మెటల్ డిజైన్ ,లగ్జరీ లుక్:

Advertisement

ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్‌ వాచ్‌లు కేవలం టైమ్.. చూసే గాడ్జెట్‌గా కాకుండా.. ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా మారిపోయాయి. ఈ కోవకే చెందిన ఈ మోడల్ చాలా ప్రీమియం మెటల్ బాడీ, డిజైన్‌తో వస్తుంది. దీని స్టీల్ బ్లాక్ స్ట్రాప్ వాచ్‌కు ఒక రిచ్ , క్లాసీ లుక్‌ను ఇస్తుంది. సాధారణ ప్లాస్టిక్ వాచ్‌లతో పోలిస్తే.. ఇది చూడటానికి చాలా ట్రెండీగా ఉండి, సూట్లు, క్యాజువల్ వేర్.. ఇలా ఏ డ్రెస్ పైకైనా పర్‌ ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. రోజంతా.. చేతికి పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీన్ని ఎర్గోనామిక్‌గా డిజైన్ చేశారు.

అద్భుతమైన 1.96 ఇంచుల డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ అట్రాక్షన్ దాని స్క్రీన్. ఇందులో.. ఏకంగా 1.96 ఇంచుల (4.97 సెం.మీ) పెద్ద అమెలోడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. దీని రిజల్యూషన్ చాలా బాగుండటం వల్ల ఎండలో.. బయటికి వెళ్లినా స్క్రీన్ పై.. ఉన్న అక్షరాలు, విజువల్స్ అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలో.. ‘ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే’సపోర్ట్ కూడా ఉంది. అలాగే .. రకరకాల క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లను ఉపయోగించి మీ మూడ్‌కు తగినట్టుగా వాచ్ లుక్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.

Advertisement

ఏఐ కోచ్, హెల్త్ ట్రాకింగ్ మ్యాజిక్:

ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఈ వాచ్‌లో ప్రత్యేకమైన.. ‘ఏఐ కోచ్’ ఫీచర్‌‌లను వాడారు. ఇది మీ వర్కవుట్ రొటీన్‌ను విశ్లేషించి, మీకు తగిన ఫిట్‌నెస్ సలహాలను అందిస్తుంది. దీని వల్ల వ్యాయామం చేసేటప్పుడు మరింత మెరుగైన ఫలితాలు పొందొచ్చు.

ఇక ఆరోగ్యానికి సంబంధించి ఇందులో .. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు) సెన్సార్, స్లీప్ ట్రాకర్ , స్ట్రెస్ లెవెల్స్ పర్యవేక్షించే లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ నడకను లెక్కించడానికి స్టెప్ కౌంటర్, క్యాలరీ బర్న్ ట్రాకింగ్ వంటి స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

బ్లూటూత్, బ్యాటరీ బ్యాకప్:

ఈ స్మార్ట్‌ వాచ్‌లో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ , స్పీకర్ సపోర్ట్ ఉంది. దీని వల్ల బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించి ఫోన్ తీయకుండానే.. వాచ్ ద్వారా నేరుగా మాట్లాడొచ్చు. డైరెక్ట్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ వంటి ఆప్షన్లు దీనిలో లభిస్తాయి.

బ్యాటరీ విషయానికి వస్తే.. పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చడం వల్ల సాధారణ వాడకంలో ఇది ఈజీగా కొన్ని రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉండటం వల్ల.. వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా వాచ్‌ పాడవదు.

Also Read: సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు 

ధర, ఎవరికి బెస్ట్?

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర సుమారు రూ. 4,299 గా ఉంది. రూ.4,500 లోపు బడ్జెట్‌లో ప్రీమియం మెటల్ బాడీ, అమెలోడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ , ఏఐ కోచ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే ఉద్యోగులకు, టెక్ లవర్స్‌కు , ఫిట్‌నెస్ లవర్స్‌కు ఇది ఒక అద్భుతమైన, వ్యాల్యూ ఫర్ మనీ ఛాయిస్!

Related News

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

Big Stories

Advertisement
×