Kashi Majili Trailer:రేణు దేశాయ్..పరిచయం అక్కరలేని పేరు.గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఇపుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆమె నటించిన ‘కాశీ మజిలీ’ వెబ్ ఎపిసోడ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తే రేణు దేశాయ్ పాత్ర కథలో కీ రోల్ పోషిస్తున్నట్టు అర్థమవుతుంది.జె.కె. ఆర్ట్స్ బ్యానర్‌పై జగదీష్ కుమార్ కాళ్లూరు ఈ వెబ్ ఎపిసోడ్‌ను నిర్మించారు. 600కు పైగా యాడ్స్‌కు దర్శకత్వం వహించిన యమునా కిషోర్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించడం విశేషం.
ప్రస్తుతం ఓటీటీ, డిజిటల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా సినిమాల కంటే తక్కువ సమయంలో ఒక కథను చెప్పే వెబ్ ఎపిసోడ్స్, షార్ట్ సిరీస్‌లని ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో రేణు దేశాయ్ లాంటి స్టార్ కీలక పాత్రలో నటిస్తున్న కాశీ మజిలీ’వెబ్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం.
ఇక ‘కాశీ మజిలీ’ ట్రైలర్‌లో రేణు దేశాయ్ లుక్‌పై కూడా ఇపుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎలాంటి ఓవర్ ది టాప్ గ్లామర్ లేకుండా సహజమైన లుక్‌లో ఆమె కనిపించడం ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా ఉందనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో ఆమె కళ్లతోనే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ట్రైలర్ కే హైలెట్. ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత కెమెరా ముందు నిలబడినా ఆమె యాక్టింగ్‌లో అదే గ్రేస్ చూపించడం ఇక్కడ మరో హైలెట్.
‘కాశీ మజిలీ’ వెబ్ ఎపిసోడ్ ఈటీవీ విన్‌లో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్13న టెలీకాస్ట్ అయ్యేందుకు రెడీ అయ్యింది. సినిమా థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రేణు దేశాయ్ పలకరిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ మళ్లీ నటిగా కనిపించడం ‘కాశీ మజిలీ’కి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.
రేణు దేశాయ్ విషయానికి వస్తే కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, రచయితగా కూడా తన ప్రతిభను చూపించారు. ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇక నటిగా సినిమాలకు దూరంగా ఉండగా తాజాగా కథ డైలాగ్స్ అందిస్తూ ఇలా సరికొత్తగా ‘కాశీ మజిలీ’తో పలకరించేందుకు రెడీ అవ్వడం విశేషం.
ALSO READ:ఈశ్వర్ సాయికి బెయిల్.. ఇక తప్పించుకున్నట్టేనా?
ట్రైలర్‌తో క్యూరియాసిటీ పెంచిన ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది? రేణు దేశాయ్ కమ్‌బ్యాక్‌కు ఈ వెబ్ ఎపిసోడ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది చూడాలి.