boAt Lunar Discovery: యూత్ స్టైల్‌ను మార్చేయడంలో బోట్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. కేవలం సాధారణ కస్టమర్ల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన డివైస్‌లలో boAt Lunar Discovery ఒకటి. సుమారు రూ.1505 ధరలలో లభించే ఈ స్మార్ట్‌వాచ్, మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. మరి దీనిలోని ప్రత్యేకతలు, ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా.
అద్భుతమైన డిస్‌ప్లే, ప్రీమియం లుక్:
ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఇందులో పెద్ద 1.39 అంగుళాల (3.5 సెమీ) హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. దీని మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్ చేతికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. పార్టీలకైనా, క్యాజువల్ వేర్‌కైనా ఈ వాచ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ఫోన్ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు.. లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు చేతితోనే.. కాల్స్ మాట్లాడటానికి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో.. బిల్ట్-ఇన్ మైక్ ,స్పీకర్ ఉండటం వల్ల కాలింగ్ అనుభూతి చాలా బాగుంటుంది. అలాగే రీసెంట్ కాల్స్, డైల్ ప్యాడ్ వంటి ఆప్షన్లు నేరుగా వాచ్‌లోనే లభిస్తాయి.
ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఇందులో ఎన్నో హెల్త్ సెన్సార్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) లెవెల్స్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు మీ ఫిట్‌నెస్‌ను అదుపులో ఉంచుతాయి. రోజువారీ వ్యాయామాలు, రన్నింగ్, వాకింగ్ చేసేవారికి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఎంతో సహాయపడతాయి.
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ: సాధారణ వాడకంపై మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
IP వాటర్ రెసిస్టెంట్: చెమట లేదా వర్షపు నీటి నుంచి రక్షణ లభిస్తుంది.
క్లౌడ్ వాచ్ ఫేసెస్: మీ మూడ్‌కి తగినట్లుగా ప్రతీ రోజూ కొత్త వాల్‌పేపర్‌లను సెట్ చేసుకోవచ్చు.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ బోట్ మోడల్ స్మార్ట్ వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ.1505 ధర పరిధిలో లభించే.. అద్భుతమైన వాల్యూ ఫర్ మనీ గ్యాడ్జెట్ ఇది.