E-Paper
Advertisement

చలికాలం అలర్ట్..బీపీ,షుగర్ ఉన్నవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

చలికాలం అలర్ట్..బీపీ,షుగర్ ఉన్నవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయెద్దు!
Advertisement

winter health tips: చలి వాతావరణంలో.. శరీరంలోని రక్తనాళాలు కొంచెం కుంచించుకుపోతాయి. ఉష్ణోగ్రతను.. కాపాడుకోవడానికి శరీరం చేసే.. ఈ సహజ ప్రక్రియ వల్ల రక్త పోటు పెరిగే.. అవకాశం ఉంటుంది. మరో వైపు, చలి కాలంలో చాలా మంది బయటికి వెళ్లి నడవడం లేదా వర్కవుట్స్ చేయడం తగ్గిస్తారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా వేగంగా పెరిగే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే బీపీ, డయాబెటిస్ ఉన్నవారు ఈ సీజన్‌లో నిర్లక్ష్యం చేయకుండా.. రెగ్యులర్‌గా మానిటర్ చేసుకోవడం చాలా అవసరం.

సాధారణ పొరపాట్లు:

చలికాలంలో.. చాలా మంది చేసే పెద్ద తప్పు నీళ్లు తక్కువగా తాగడం. దాహం తక్కువగా అనిపిస్తుందని హైడ్రేషన్‌ని పట్టించుకోకపోతే.. రక్తం చిక్కబడే ఛాన్స్ ఉంటుంది. ఇది బీపీ, షుగర్ రెండింటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే.. చలిగా ఉందని ఇంట్లోనే కూర్చుని వేయించినవి, తీపి పదార్థాలు, రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం కూడా సమస్యను పెంచుతుంది. కొందరు చలి వల్ల మందులు లేదా ఇన్సులిన్ టైమ్‌ని మార్చడం లేదా డాక్టర్‌ని సంప్రదించకుండానే.. డోసేజ్ తగ్గించడం వంటి పొరపాట్లు చేస్తారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

డైట్ ,హైడ్రేషన్‌లో జాగ్రత్తలు:

Advertisement

ఈ సీజన్‌లో మన ప్లేట్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా ఉండే.. కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఫుడ్స్ డైట్‌లో.. చేర్చుకుంటే షుగర్ స్పైక్స్ తగ్గుతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, ప్రాసెస్డ్ స్నాక్స్‌ని తగ్గిస్తే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. రోజంతా గోరు వెచ్చని నీళ్లు తగినంత తాగడం అలవాటు చేసుకుంటే.. హైడ్రేషన్ బాగుంటుంది. వేడి వేడి డ్రింక్స్ తాగాలనిపించినప్పుడు చక్కెర ఎక్కువగా ఉండే వాటికి బదులు హెర్బల్ టీ లేదా సూప్స్ తీసుకోవడం బెటర్.

వర్కవుట్స్, వాకింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి?

చలికాలం కదా అని ఎక్సర్‌సైజ్‌కి పూర్తిగా బ్రేక్ ఇవ్వకూడదు. తెల్లవారుజామున మరీ ఎక్కువ చలిగా ఉండే టైమ్ కంటే, కాస్త ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ లేదా యోగా చేయడం మంచిది. ఇంట్లోనే సింపుల్ స్ట్రెచింగ్, కార్డియో లేదా స్ట్రెంత్ ఎక్సర్‌సైజ్‌లు చేసినా సరి పోతుంది. బయటికి వెళ్లేటప్పుడు స్వెటర్ లేదా జాకెట్ వేసుకుని, తల, చెవులు కప్పి ఉంచేలా.. జాగ్రత్త పడితే చలిగాలి ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉండటం.. వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగు పడి, బీపీ కూడా అదుపులో ఉంటుంది.

Advertisement

Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా..ఈ విటమిన్ లోపంతో బట్టతల ముప్పు!

రెగ్యులర్ చెకప్స్ ,డాక్టర్ సలహా :

చలి కాలంలో బీపీ, షుగర్ లలో మార్పులు సహజమే కాబట్టి, వాటిని ఇంట్లోనే రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. రీడింగ్స్ తరచుగా ఎక్కువగా వస్తున్నా, తలనొప్పి, మైకం, ఛాతీలో ఇబ్బంది, అతిగా దాహం లేదా అలసట వంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. మీ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టు మందుల సమయం లేదా మోతాదులో మార్పులు అవసరమా లేదా అనేది వారు నిర్ణయిస్తారు.

చిన్న జాగ్రత్తలతో పెద్ద సమస్య:

అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి చలి కాలం భయపడాల్సిన సీజన్ కాదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్. డైట్‌లో చిన్న మార్పులు, తగినంత నీళ్లు, టైమ్‌కి మందులు తీసుకోవడం వంటి అలవాట్లతో ఈ సీజన్‌ని హాయిగా, సేఫ్‌గా గడపొచ్చు.

Related News

బడ్జెట్‌లో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్..వైబ్స్ నెక్స్ట్ లెవెల్‌ అంతే!

ఫైబర్ నెట్ ఉన్నా సరే.. వైఫై రూటర్లలో ఇప్పటికీ DSL పోర్ట్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్‌బార్..సినిమాలు,క్రికెట్ మ్యాచ్‌లకి నెక్స్ట్ లెవెల్ సౌండ్!

విడుదలకు ముందే Vivo X500 సిరీస్, Watch GT 2 ధరలు లీక్.. ఈసారి బడ్జెట్ గట్టిగానే పెట్టాలి!

ఫేస్ అన్‌లాక్ వెనుక ఇంత పెద్ద తంతంగం నడుస్తోందా? చీకట్లోనూ పనిచేసే ఆ 5 టెక్నాలజీలు ఇవే!

ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!

Big Stories

Advertisement
×