BigTV English

Poco C75 vs Lava Yuva 2 vs Infinix Hot 50 : వీటిలో రూ.10వేలలోపు బెస్ట్ 5G మెుబైల్ ఏదంటే!

Poco C75 vs Lava Yuva 2 vs Infinix Hot 50 : వీటిలో రూ.10వేలలోపు బెస్ట్ 5G మెుబైల్ ఏదంటే!

Poco C75 vs Lava Yuva 2 vs Infinix Hot 50 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు పోకో, లావా, ఇవ్ఫినిక్స్ రూ.10 వేలలోపే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొచ్చేసాయి. వీటిలో రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ సైతం ఉంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు ధర సైతం బెస్ట్ గానే ఉందని చెప్పాలి. అయితే వీటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే..


Infinix కంపెనీ Hot 50 5G పేరుతో రూ.10వేలలోపే 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చింది. దీనికి పోటీగా Poco రూ. 7,999, Lava రూ.9,499కే బెస్ట్ ఫీచర్ మెుబైల్స్ ను తీసుకొచ్చేశాయి.  ఇక ఈ మూడు మొబైల్స్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ధర ఎలా ఉన్నాయో చూద్దాం

Poco C75 5G –


Poco C75 5G మెుబైల్ లో 6.88 అంగుళాల HD + డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌, గరిష్టంగా 600 nits బ్రైట్‌నెస్, MediaTek Helio G81 అల్ట్రా ప్రాసెసర్, ARM Mali G52 GPU సిస్టమ్ ఉన్నాయి. గరిష్టంగా 8GB LPDDR4X RAM + 256GB eMMC5.1 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ తో 1TB వరకు పెంచుకునే ఛాన్స్ సైతం ఉంది. 50MP ప్రైమరీ షూటర్, సెకండరీ సెన్సార్‌, సెల్ఫీ – వీడియో కాల్స్ కోసం 13MP షూటర్ కూడా ఉంది. 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ 5160mAh బ్యాటరీతో వచ్చేసింది.

Lava Yuva 2 5G –

Lava Yuva 2 5G మెుబైల్ లో 6.67 అంగుళాల HD + LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌, గరిష్టంగా 700 nits బ్రైట్‌నెస్‌ ఉన్నాయి.  UNISOC T760 ప్రాసెసర్, Mali G57 MC4 GPU, 4GB LPDDR4x RAM + 128GB UFS 2.2 స్టోరేజ్‌, మైక్రో SD కార్డ్ తో 512GB స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి. 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌,  సెల్ఫీలు – వీడియో కాల్స్ కోసం 8MP షూటర్ ఉన్నాయి. 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్, FM రేడియో కూడా ఉన్నాయి. మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ మెుబైల్ ధర రూ. 9,499.

Infinix Hot 50 5G 5G –

Infinix Hot 50 5G మెుబైల్ 1600 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి Mali G57 MC2 GPU కూడా ఉంది. ఇది 8GB వరకు LPDDR4x RAM + 128GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వచ్చేసింది. మైక్రో SD కార్డ్ స్లాట్ తో 1TB వరకు స్టోరేజ్ ను పెంచే ఛాన్స్ ఉంది. 48MP Sony IMX582 ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ LED ఫ్లాష్‌తో డెప్త్ సెన్సార్‌తో వచ్చేసింది. సెల్ఫీలు-వీడియో కాల్స్ కోసం 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన XOS 14.5 ఉన్నాయి. వాటర్ టచ్ రెసిస్టెన్స్ ఫీచర్‌కు సపోర్ట్‌ చేసే డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ కూడా ఉంది.

ఇక Infinix Hot 50 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 కాగా.. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 10,999గా ఉంది. ఇక Lava Yuva 2 5G ధర రూ. 9,499 కాగా.. Poco C75 5G మెుబైల్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999గా ఉంది.

ALSO READ : దిమ్మతిరిగే ఫీచర్ మెుబైల్స్ రూ.30వేలలోపే! జనవరి 9న లాంఛ్ చేస్తున్న పోకో

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×