AP Schemes: ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలో మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుండి ఎప్పుడు ఆ పథకంపై కబురు వస్తుందా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా, తాజాగా కూటమి ప్రభుత్వం కూడ కీలక ప్రకటన చేసింది.
ఏపీలో పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి పేరుతో గత వైసీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థి తల్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటగా ఏడాదికి రూ. 15వేల చొప్పున విద్యార్థులకు ప్రభుత్వం అందించగా, ఆ తర్వాత రూ. 14 వేల చొప్పున ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసింది. అయితే ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు తాము, తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్నారు. ఎట్టకేలకు కొత్త ఏడాది ప్రారంభమైన రెండో రోజే సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యాసంస్థల నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం కార్యక్రమం పై సుదీర్ఘ చర్చ సాగింది.
Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. పిఠాపురంపై కీలక నిర్ణయం
ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ. 15000 అందించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మరి తల్లికి వందనం పథకం విధివిధానాలు విడుదలైతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఎందరో విద్యార్థులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. తాజాగా ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు పూర్తి సన్నాహాల్లో ఉంది.