E-Paper
Advertisement

BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!

BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!
Advertisement

BSNL Bharat Fibre: ఇంట్లోకి కొత్తగా వైఫై కనెక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ (BSNL) అదిరిపోయే శుభవార్త చెప్పింది. తమ ‘భారత్ ఫైబర్’ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం ఒక కొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని కింద నెలకు కేవలం రూ.399 ఎఫెక్టివ్ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందే అవకాశం కల్పిస్తోంది. బడ్జెట్ ధరలో మంచి కనెక్షన్ కోసం చూస్తున్న ఇళ్లు, చిన్న ఆఫీసులకు ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్.

ప్లాన్ ధర, అదనపు ప్రయోజనాలు:

సాధారణంగా ఈ భారత్ ఫైబర్ ప్లాన్ నెలవారీ రెంటల్ ధర రూ.499గా ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రత్యేక ఆఫర్ కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు ఇది ఎఫెక్టివ్‌గా నెలకు రూ.399కే లభిస్తోంది. ఈ ఆఫర్ కేవలం కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. పాత కస్టమర్లకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.

60 Mbps స్పీడ్, భారీ డేటా:

Advertisement

ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు 60 Mbps వరకు ఇంటర్నెట్ వేగం లభిస్తుంది. ఇంట్లో పిల్లల ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పనులు, వీడియో కాల్స్, హెచ్‌డీ సినిమాలు చూడటానికి ఈ స్పీడ్ సరిపోతుంది. అంతేకాకుండా.. నెలకు ఏకంగా 3,300GB డేటాను అందిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడినా డేటా అయిపోతుందనే భయం ఉండదు. అయితే ఏరియా, నెట్‌వర్క్ పరిస్థితులను బట్టి స్పీడ్‌లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

Also Read: వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

మొదటి నెల ఫ్రీ, వరుసగా డిస్కౌంట్:

Advertisement

కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఇందులో మరో క్రేజీ ఆఫర్ పెట్టింది. కొత్తగా ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వారికి మొదటి క్యాలెండర్ నెల బిల్లు పూర్తిగా ఉచితం. ఆ తర్వాత వచ్చే మూడు నెలల పాటు ప్రతి నెలా బిల్లులో రూ.100 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మొదటి నాలుగు నెలల పాటు కస్టమర్లకు భారీగా డబ్బు ఆదా అవుతుంది.

ఆఫర్ గడువు ఎప్పటివరకంటే?

ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు జనవరి 29, 2027 వరకు ఈ ప్లాన్ కింద కొత్త కనెక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కనెక్షన్ తీసుకునే ముందు మీ ప్రాంతంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో, అలాగే ఇన్‌స్టాలేషన్ ఛార్జీల వివరాలను దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఒకసారి కనుక్కోవడం మంచిది.

Also Read: మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

Tags

Related News

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

రూ.902కే స్మార్ట్‌వాచ్..తక్కువ ధరకే పిచ్చెక్కించే ఫీచర్లు!

మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇంతకంటే..మంచి హెడ్‌ఫోన్స్ ఉంటాయా?

ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!

రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!

2027లో యాపిల్ సంచలనం.. ఒకేసారి మార్కెట్లోకి రాబోతున్న 6 కొత్త గాడ్జెట్స్ ఇవే!

Big Stories

Advertisement
×