BigTV English

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ చీప్ అండ్ బెస్ట్ ప్లాన్, బెనిఫిట్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ చీప్ అండ్ బెస్ట్ ప్లాన్, బెనిఫిట్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

BSNL New Prepaid Plans: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం చక్కటి ప్లాన్స్ అందుబాటలోకి తీసుకొస్తున్నది. ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ఫ్లాన్లను 25 శాతం పెచ్చి కస్టమర్లకు షాక్ ఇవ్వడంతో చాలా మంది, బీఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు. వారి సంఖ్యను మరింత పెంచుకునేందుకు ఆకట్టుకునే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటిస్తోంది. సగటు కస్టమర్లకు అనువైన చౌక ప్లాన్స్ ను రూపొందిస్తోంది.


రూ.298తో 52 రోజుల వ్యాలిడిటీ  

బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తున్న చౌక ప్లాన్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాంటి చౌకైన ఓ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం రూ. 298 రూపాయలతో రీచార్జ్ చేస్తే 52 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్ సౌకర్యం అందిస్తున్నది. ఈ ప్లాన్ ద్వారా  ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. 52 రోజు రోజులకు గాను 52 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 1 జీబీ వినియోగించుకోవచ్చు.


ఈ ప్లాన్ ను ఎందుకు ఎంచుకోవాలి?

వినియోగదారులకు అపరిమిత కాలింగ్,  పరిమిత డేటా అవసరం ఉన్నట్లైతే ఈ ప్లాన్ చాలా బాగా పని చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఏ వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్?

బీఎస్ఎన్ఎల్  రూ. 298 ప్లాన్ కాల్ చేయడానికి అనువైన ఫోన్‌ని ఉపయోగించే వినియోగదారులకు మంచిది. తక్కువ డబ్బులలతో సుమారు రెండు నెలల పాటు ఫోన్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాస్త ఎక్కువ డేటా కావాలి అనుకుంటే బీఎస్ఎన్ఎల్ మరో మంచి టారిఫ్ ను అందిస్తున్నది. ఈ ప్లాన్ ద్వారా రూ.245 వెచ్చించాల్సి ఉంటుంది.  45 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.

రూ.666 ప్లాన్ త 105 రోజుల వ్యాలిడిటీ

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో బెస్ట్ ప్లాన్ రూ. 666. ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 105 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఏ నెట్ వర్క్ కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు. ఎక్కువ కాలింగ్, డేటా అవసరాలకు ఈ ప్లాన్ చక్కటి ఎంపికగా చెప్పుకోవచ్చు.

ప్రైవేట్ కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ సవాల్

ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచిన నేపథ్యంలో కస్టమర్లు మళ్లీ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వరంగ సంస్థ రిలయన్స్‌ జియో, ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ ఐడియా లాంటి ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు గట్టిపోటీనిస్తోంది. కంపెనీ సరసమైన ప్లాన్లను కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ ను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి లక్ష 4జీ టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్, మర్చిపోయిన విషయాలు గుర్తు పెట్టుకుంటుంది తెలుసా?

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం.. iFixitలో తక్కువ స్కోరు

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×