E-Paper
Advertisement

జియో, ఎయిర్‌టెల్‌కి BSNL బిగ్ షాక్.. కేవలం రూ.1కే రీఛార్జ్.. 500 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితం!

జియో, ఎయిర్‌టెల్‌కి BSNL బిగ్ షాక్.. కేవలం రూ.1కే రీఛార్జ్.. 500 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితం!
Advertisement

BSNL 1 Rupee Offers: భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తమ వినియోగదారుల కోసం అత్యంత చౌకైన, ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్ బేస్‌ను పెంచుకోవడంతో పాటు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది.

రూ.1 ఫ్రీడమ్ 2.0 ఆఫర్..

కొత్తగా BSNL నెట్‌వర్క్‌లోకి మారే కొత్త కస్టమర్ల కోసం ‘రూ.1 ఫ్రీడమ్ 2.0’ పేరిట ఊహించని ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు కేవలం ఒక్క రూపాయికే ప్రతిరోజూ 1 GB డేటా, రోజుకు 100 ఉచిత SMSలు మరియు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 24 రోజులుగా నిర్ణయించారు.

Advertisement

Also Read: పిక్సెల్ 11 నుంచి పిక్సెల్ ట్యాగ్ వరకు.. గూగుల్ 2026 ఈవెంట్‌లో టాప్ హైలైట్స్ ఇవే!

ఫైబర్ యూజర్లకు రూ.1,111 ప్లాన్..

హైస్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకునే వారి కోసం ‘ఫైబర్ ఫ్రీడమ్’ పేరిట ప్రత్యేక ప్లాన్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. నెలకు రూ.1,111 ధరతో లభించే ఈ ప్యాక్‌లో వినియోగదారులకు 200 Mbps వరకు వేగం అందుతుంది. దీంతో పాటు నెలకు 5,000 GB డేటా లభిస్తుంది. ఓటీటీ ప్రియుల కోసం ఈ ప్లాన్‌తో ఉచితంగా 25కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ కూడా ఇస్తున్నారు.

సరికొత్త BSNL సెల్ఫ్‌కేర్ యాప్..

Advertisement

కస్టమర్లు తమ మొబైల్ నుంచే రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు సులభంగా చేసుకునేందుకు BSNL Selfcare యాప్‌ను పూర్తిగా నూతన ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చారు. దీనిలో AI చాట్‌బాట్, వాయిస్ సెర్చ్, మల్టిపుల్ అకౌంట్ మేనేజ్‌మెంట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఫ్రీగా 500 లైవ్ టీవీ ఛానెళ్లు..

మొబైల్ కస్టమర్లకు వినోదాన్ని అందించేందుకు ‘టాంగో టీవీ’ సహకారంతో ఉచిత ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. కొత్త సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా వినియోగదారులు దాదాపు 500 ప్రత్యక్ష (Live) టీవీ ఛానెళ్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు.

Also Read: అమెజాన్‌లో Apple Watch Series 11పై దిమ్మతిరిగే ఆఫర్.. ఏ మోడల్ ధర ఎంత తగ్గిందంటే?

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×