E-Paper
Advertisement

టీజీఎస్పీడీసీఎల్‌ల్లో వసూళ్ల రికార్డు.. 4 నెలల్లో ఏంత చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

టీజీఎస్పీడీసీఎల్‌ల్లో వసూళ్ల రికార్డు.. 4 నెలల్లో ఏంత చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!
Advertisement

Revenue Collection: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) రెవెన్యూ వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. 2026 ఏప్రిల్‌ నుంచి జూలై వరకు సంస్థ పరిధిలోని 21 సర్కిళ్లలో రూ.5,185.69 కోట్ల డిమాండ్‌కు గాను రూ.5,094.67 కోట్ల రెవెన్యూ వసూలైంది. దీంతో మొత్తం వసూళ్ల శాతం 98కి చేరింది. ఎల్‌టీ వినియోగదారుల బిల్లింగ్, రెవెన్యూ కలెక్షన్, నెలవారీ వసూళ్లు, కలెక్టబుల్ బకాయిల వసూళ్లు, ఆదాయ వృద్ధిపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

హైదరాబాద్‌లోని..

Advertisement

హైదరాబాద్‌లోని సైబర్‌సిటీ, బంజారాహిల్స్, హబ్సిగూడ, హైదరాబాద్ సెంట్రల్, సారూర్‌నగర్, సికింద్రాబాద్, మెడ్చల్ సర్కిళ్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సిద్ధిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ సర్కిళ్లు కూడా లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు సాధించాయి.

98 శాతం వసూళ్లు..

Advertisement

ఇదిలా ఉండగా రూ.215.39 కోట్ల కలెక్టబుల్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ప్రతి సర్కిల్‌లో బకాయిల తగ్గింపునకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, రెవెన్యూ వసూళ్ల శాతాన్ని మరింత పెంచాలని సూచించారు. సిబ్బంది అంకితభావం, వినియోగదారుల సహకారంతోనే 98 శాతం వసూళ్లు సాధ్యమయ్యాయని సీఎండీ పేర్కొన్నారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడం ద్వారా సంస్థకు సహకరించాలని వినియోగదారులను కోరారు.

Also Read: రైతు డిస్కం ఏర్పాటు పై బిగ్ అప్డేట్.. హైలెవల్ కమిటీతో సీఎం రేవంత్ బిగ్ ప్లాన్!

Tags

Related News

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

Big Stories

Advertisement
×