E-Paper
Advertisement

బాహుబలి పవర్ బ్యాంక్.. ఏకంగా లక్ష mAh బ్యాటరీ.. 20 సార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు!

బాహుబలి పవర్ బ్యాంక్.. ఏకంగా లక్ష mAh బ్యాటరీ.. 20 సార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు!
Advertisement

Callmate Power Bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా విద్యుత్ కోతలు ఉన్న సమయంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోతే పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ ‘కాల్‌మేట్’ (Callmate) ఒక సంచలనాత్మక పరికరాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఏకంగా 100,000mAh సామర్థ్యంతో కూడిన ‘కాల్‌మేట్ ట్రెజరీ’ (Callmate Treasury) పవర్ బ్యాంక్‌ను ఆవిష్కరించింది.

సామర్థ్యంలో సరికొత్త రికార్డు

ఈ పవర్ బ్యాంక్ లో హైలెట్ ఏదైనా ఉందంటే అది 1,00,000mAh బ్యాటరీ కెపాసిటీనే. సాధారణ పవర్ బ్యాంకులు 10,000mAh, 20,000mAh సామర్థ్యంతో వస్తుంటాయి. కానీ ఈ పవర్ బ్యాంక్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను సుమారు 15 నుండి 20 సార్లు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కాబట్టి లాంగ్ ట్రిప్‌లు, క్యాంపింగ్, అడ్వెంచర్ టూర్లకు వెళ్లేవారికి, బిజినెస్ ట్రావెలర్లకు ఇది ఒక పవర్‌హౌస్‌లా ఉపయోగపడనుంది.

వేగవంతమైన ఛార్జింగ్

Advertisement

ఛార్జింగ్ స్పీడ్ విషయంలో కూడా కాల్‌మేట్ ట్రెజరీ ఏమాత్రం తగ్గలేదు. ఇది 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేయనుంది. అంతేకాకుండా, ఇందులో ‘టైప్-సి పవర్ డెలివరీ (Type C PD 3.0)’ ఇన్‌పుట్, అవుట్‌పుట్ సాంకేతికతను అందించారు. దీనివల్ల పవర్ బ్యాంక్‌ను వేగంగా ఛార్జ్ చేయడమే కాకుండా దీనికి కనెక్ట్ చేసే ఇతర పరికరాలకు కూడా అంతే వేగంగా ఛార్జింగ్ అందించవచ్చు. ఈ పవర్ బ్యాంక్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ చేసే ట్యాబ్‌లు, ఇయర్‌ఫోన్స్ వంటి పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఒకేసారి మల్టిపుల్ కనెక్షన్స్

ఈ పవర్ బ్యాంక్‌లో అనేక పోర్ట్‌లను అందుబాటులో ఉంచారు. ఒకే సమయంలో మల్టిపుల్ గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేసే సౌలభ్యాన్ని కల్పించారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల తమ ఫోన్లను ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. మరోవైపు పవర్ బ్యాంక్ లో బ్యాటరీ ఎంత ఉందో తెలుసుకోవడానికి అనువుగా డిజిటల్ డిస్‌ప్లే కూడా ఇందులో ఇచ్చారు.

Advertisement

Also Read: పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?

భద్రతా ప్రమాణాలు

పెద్ద సామర్థ్యం ఉన్న బ్యాటరీ కావడం వల్ల భద్రతకు కంపెనీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. షార్ట్ సర్క్యూట్, ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్, ఓవర్ వోల్టేజ్ వంటి ప్రమాదాల నుండి పరికరాలను కాపాడటానికి ఇందులో మల్టీ లేయర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అమర్చారు. ఓవైపు పవర్ బ్యాంక్ ను ఛార్జ్ చేస్తూనే మెుబైల్స్ ను కనెక్ట్ చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బందని ఉండదని కంపెనీ వర్గాలు భరోసా కల్పిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ లో రూ.5,899 కి ఇది అందుబాటులో ఉంది.

Also Read: అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×