E-Paper
Advertisement

రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్

రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్
Advertisement

Marq thunder 2.0 channel soundbar:  ఈ రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. మొబైల్స్, ల్యాప్‌ టాప్‌లు లేదా స్మార్ట్ టీవీలలో.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ ఉంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద హోమ్ థియేటర్లు కొనడానికి ప్రతి ఒక్కరి బడ్జెట్ సరిపోదు. అలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్ తన సొంత బ్రాండ్ అయిన ‘మార్క్యూ’ ద్వారా అద్భుతమైన ఫీచర్లతో ఈ మోడల్ ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు, ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్, ఆర్జీబీ LED లైట్లు:

ఈ సౌండ్‌బార్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్ లుక్‌లో వస్తుంది. దీనికి ఇచ్చిన ఆర్జీబీ LED లైట్లు ఈ స్పీకర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గదిలో లైట్లు ఆఫ్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు.. ఈ లైట్ల వెలుగు ఒక మ్యూజిక్ క్లబ్ లేదా థియేటర్ వైబ్‌ను తెచ్చిపెడుతుంది. కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల టీవీ క్రింద లేదా టేబుల్ మీద సర్దుకోవడం చాలా ఈజీ.

సౌండ్ అవుట్‌పుట్, డ్యుయల్ డ్రైవర్లు:

Advertisement

పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, ఇది మొత్తం 40 వాట్ల పవర్ ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఇందులో అమర్చిన డ్యుయల్ డ్రైవర్లు క్రిస్టల్ క్లియర్ వాయిస్‌తో పాటు మంచి బేస్‌ను అందిస్తాయి. యాక్షన్ సినిమాలు చూసేటప్పుడు లేదా పార్టీ సాంగ్స్ వినేటప్పుడు ఆడియో ఫీల్ చాలా బాగుంటుంది. 2.0 ఛానల్ సపోర్ట్ ఉండటం వల్ల రూమ్ అంతటా సౌండ్ మారుమోగుతుంది.

బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ:

ఈ సౌండ్‌బార్ మరో ప్రత్యేకత దీని పోర్టబిలిటీ. ఇది కేవలం వైర్డ్ కనెక్షనే కాకుండా, ఇన్‌బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. సుమారు 8 గంటల వరకు నిరంతరం పని చేస్తుంది. కాబట్టి కరెంట్ లేని సమయంలో లేదా బయట పిక్నిక్‌లకు వెళ్లినప్పుడు కూడా దీన్ని ఈజీగా వాడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఇతర ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అందుకే దీనిని ఎవరైనా ఈజీగా వాడొచ్చు.

Advertisement

Also Read:  ల్యాప్‌టాప్ క్లీన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వేల రూపాయలు నష్టపోతారు!

ధర వివరాలు:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ మోడల్ ధర చాలా తక్కువ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర కేవలం రూ.1,599 మాత్రమే! కేవలం పదిహేను వందల రూపాయల బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ సౌండ్‌ బార్ దొరకడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో మీ హోమ్ ఎంటర్‌ టైన్‌మెంట్ ఫీల్ డబల్ చేసుకోవాలనుకుంటే, మార్క్యూ థండర్ బ్లూ టూత్ సౌండ్‌ బార్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్, మంచి బ్యాటరీ బ్యాకప్ , పవర్‌ ఫుల్ సౌండ్‌తో వస్తున్న ఈ గ్యాజెట్‌ను ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×