E-Paper
Advertisement

తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్..మ్యూజిక్ లవర్స్‌కు పండగే!

తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్..మ్యూజిక్ లవర్స్‌కు పండగే!
Advertisement

Frontech 1.0 usb speaker with aux: ఇంటి దగ్గర వర్క్ చేసేవారైనా, ఆన్‌లైన్ క్లాసులు వినేవారైనా, లేదా సరదాగా సినిమాలు చూసేవారైనా మంచి సౌండ్ క్వాలిటీ లేకపోతే ఆ మజాయే రాదు. పెద్ద పెద్ద హోం థియేటర్లు కొనడానికి ఎక్కువ బడ్జెట్ కావాలి. కానీ, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, అతి తక్కువ ధరలో రోజువారీ అవసరాలకు సరి పోయేలా ఒక చక్కని స్పీకర్ కోసం చూస్తున్నవారికి ఈ మోడల్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ చిన్న స్పీకర్ అందించే.. మ్యూజిక్ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

డిజైన్, LED లైట్ల ప్రత్యేకత:

ఈ స్పీకర్ చూడటానికి చాలా కాంపాక్ట్ సైజులో, స్టైలిష్‌గా ఉంటుంది. డెస్క్‌ టాప్ లేదా ల్యాప్‌ టాప్ పక్కన పెట్టుకోవడానికి ఇది చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీనికి … ఉన్న డైనమిక్ LED లైట్లు ఈ స్పీకర్‌కు మోడర్న్ లుక్‌ను ఇస్తాయి. ముఖ్యంగా గదిలో లైట్లు ఆఫ్ చేసి సినిమాలు చూసేటప్పుడు.. లేదా గేమింగ్ ఆడేటప్పుడు ఈ LED లైట్ల వెలుగు గదికి ఒక కూల్ వైబ్‌ను ఇస్తుంది.

కనెక్టివిటీ, వాల్యూమ్ కంట్రోల్:

Advertisement

ఈ స్పీకర్ యూజ్ చేయడం చాలా ఈజీ. ఇది USB పవర్డ్ కాబట్టి దీనికి ప్రత్యేకంగా.. ప్లగ్‌ పాయింట్ అవసరం లేదు. మీ ల్యాప్‌ టాప్ లేదా పీసీలోని USB పోర్ట్ ద్వారానే ఇది పవర్‌ను తీసుకుంటుంది. అంతేకాకుండా.. 3.5mm ఆక్స్ కేబుల్ ద్వారా దీన్ని మొబైల్స్, ట్యాబ్లెట్లు, ఇతర మ్యూజిక్ ప్లేయర్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్ వైర్ పైనే ఈజీగా ఆపరేట్ చేసుకునేలా వాల్యూమ్ కంట్రోల్ నాబ్ లేదా బటన్ ఇవ్వడం దీని మరో ప్లస్ పాయింట్.

సౌండ్ అవుట్‌పుట్, పెర్ఫార్మెన్స్:

పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, ఈ ఫ్రంటెక్ స్పీకర్ క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ను అందిస్తుంది. ఆన్‌లైన్ మీటింగ్‌లు అటెండ్ అయ్యేటప్పుడు అవతలి వారి గొంతు స్పష్టంగా వినపడటానికి, మ్యూజిక్ వినేటప్పుడు మంచి ఆడియో ఫీల్ పొందడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది. పర్సనల్ యూజ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది  ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్ క్లీన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వేల రూపాయలు నష్టపోతారు!

ధర:

అన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఈ మోడల్ ధర చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రస్తుత మార్కెట్, ఆన్‌లైన్ ప్లాట్‌ ఫామ్‌లలో దీని ధర సుమారు రూ.448 మాత్రమే.ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ స్పీకర్ దొరకడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే గాడ్జెట్ కావాలనుకునే వారికి  ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

తక్కువ బడ్జెట్‌లో మీ ల్యాప్‌టాప్ లేదా పీసీ సౌండ్‌ని పెంచు కోవాలనుకుంటే, స్టైలిష్ లుక్ కోరుకుంటే ఫ్రంటెక్ నుంచి వచ్చిన ఈ USB స్పీకర్‌ను పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. మీ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఇది బెస్ట్ ఎంటర్‌ టైన్‌మెంట్ ఫీల్ అందిస్తుంది.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×