E-Paper
Advertisement

స్టైలిష్ లుక్ కోరుకునేవారి కోసం బెస్ట్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు

స్టైలిష్ లుక్ కోరుకునేవారి కోసం బెస్ట్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు
Advertisement

Noise evolve 4 smartwatch : ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్‌ వాచ్‌ అనేది కేవలం సమయం చూసుకునే గాడ్జెట్ మాత్రమే కాదు, అది మన ఫిట్‌నెస్‌ను, లైఫ్‌ స్టైల్‌ను ట్రేస్ చేసే ఒక అద్భుతమైన గ్యాజెట్. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో ‘నాయిస్’ఎప్పుడూ ముందుంటుంది. ఆ కోవకే చెందిన లేటెస్ట్ మోడల్ ప్రస్తుతం టెక్కీలను, యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలొ ఇది బెస్ట్ ఫీచర్లు ఉన్న మోడల్ గా ట్రెండ్ అవుతోంది. అంతే కాకుండా దీని లుక్ కూడా క్లాసీగా ఉండటం వల్ల యూత్ దీనిని ఎగబడి కొంటున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ వాచ్ ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ప్రీమియం డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌వాచ్‌ మెయిన్ హైలైట్ దాని డిజైన్ , డిస్‌ప్లే. ఇది 1.46 ఇంచల అమోలెడ్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేతో వస్తుంది.కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీని ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్, అట్రాక్టివ్ ‘ఎలక్ట్రిక్ బ్లూ’స్ట్రాప్ చేతికి ధరించినప్పుడు చాలా రాయల్ లుక్‌ను ఇస్తుంది. పార్టీలకైనా, క్యాజువల్ వేర్‌కైనా ఇది పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఈ వాచ్‌లో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ , స్పీకర్ సపోర్ట్ ఉండటం వల్ల బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఫోన్ జేబులో.. నుంచి తీయకుండానే వాచ్ ద్వారా నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు, లిఫ్ట్ చేయవచ్చు. దీంతో పాటు సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్, అలారం వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్ 

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారికి ఈ వాచ్ ఒక పర్సనల్ ట్రైనర్‌లా పని చేస్తుంది. అంతే కాకుండా హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్) ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల జిమ్‌కి వెళ్లేవారు, రన్నింగ్ చేసేవారు తమ వర్కౌట్లను ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉండటం వల్ల చెమట పడినప్పుడు లేదా వర్షంలో తడిచినా టెన్షన్ పడాల్సిన పని లేదు.

ధర వివరాలు :
అన్ని లేటెస్ట్ హంగులు, ప్రీమియం లుక్ కలిగిన ఈ మోడల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మార్కెట్లో లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో దీని ధర కేవలం రూ. 2,499 మాత్రమే! అమోలెడ్ డిస్‌ప్లే , కాలింగ్ ఫీచర్ ఉన్న వాచ్ ఈ బడ్జెట్‌లో దొరకడం నిజంగా అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అదిరిపోయే హెల్త్ ఫీచర్లు , అంతే కాకుండా బెస్ట్ కాలింగ్ ఆప్షన్ కోరుకునేవారికి నాయిస్ ఇవాల్వ్ 4 ఒక సూపర్ ఛాయిస్. మీ స్టైల్‌ను మార్చుకోవాలనుకుంటే.. ఈ ట్రెండీ స్మార్ట్‌ వాచ్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Related News

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

రూ.799కే.. అదిరిపోయే గేమింగ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్

తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్..మ్యూజిక్ లవర్స్‌కు పండగే!

కన్వర్టబుల్ ఫీచర్‌తో.. కొత్త ఎల్జీ ఫ్రిజ్, ధర కూడా చాలా తక్కువ!

రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్

బాహుబలి పవర్ బ్యాంక్.. ఏకంగా లక్ష mAh బ్యాటరీ.. 20 సార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు!

Big Stories

Advertisement
×