E-Paper
Advertisement

ఇక‌పై టెస్టుల‌ను 4 రోజుల‌కే కుదించాలి..ఐసీసీకి సంచ‌ల‌న లేఖ‌!

ఇక‌పై టెస్టుల‌ను 4 రోజుల‌కే కుదించాలి..ఐసీసీకి సంచ‌ల‌న లేఖ‌!
Advertisement

Michael Vaughan On Test Matches:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 3 టెస్టుల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఇప్పటికే పూర్తయింది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ఫినిష్ కావడం గమనార్హం. ఇక అటు బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నాలుగు రోజుల్లో ముగియగా.. మొన్న జరిగిన రెండో టెస్టు ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. ఇలాంటి క్రమంలో ఇకపై టెస్టులను నాలుగు రోజులకు కుదించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ (Michael Vaughan). అలా అయితేనే టెస్ట్ క్రికెట్ బతుకుతుందని వ్యాఖ్యానించారు. దీంతో మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

ఇక‌పై టెస్టుల‌ను 4 రోజుల‌కే కుదించాలి..ఐసీసీకి సంచ‌ల‌న లేఖ‌!

ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ డిమాండ్ చేశారు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. ప్రస్తుత కాలంలో టెస్ట్ మ్యాచ్ ల‌ను కూడా టి20 లాగా ఆడుతున్నారని.. ఈ క్రమంలో రెండు లేదా మూడు రోజుల్లోనే రిజల్ట్ వచ్చేస్తోందని వివరించారు. అలా అయితేనే టెస్టులను జనాలు కూడా చూస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో సాంప్రదాయ టెస్టులను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలని సరికొత్త డిమాండ్ పెట్టారు వాన్. ఆ దిశగా ఐసీసీ అడుగులు వేయాలని కోరారు. నాలుగు రోజుల టెస్ట్ లు జరిగితే ప్రేక్షకుల ఆదరణ కూడా పెరుగుతుందని సూచించారు. ఈ మేరకు ఐసిసికి కూడా తాను లేఖ రాస్తానని స్పష్టం చేశారు. టెస్ట్ క్రికెట్ బ‌త‌కాలంటే, తాను చెప్పిన‌ట్లు చేయాల్సిందేన‌ని వెల్ల‌డించారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

మైఖేల్ వాన్ ప్రతిపాద‌న‌ల‌ను వ్య‌తిరేకించిన కోహ్లీ, స‌చిన్

ప్రస్తుత క్రికెటర్లు అందరూ దూకుడుగా ఆడుతున్నారని.. వాళ్లు ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్, BBL లాంటి టోర్నమెంట్ లకు ఆడిట్ అయ్యారని తెలిపారు. అలాంటి వాళ్లు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో కూడా దూకుడుగా ఆడతారని పేర్కొన్నారు. అయితే ఈ దూకుడు స్వభావం ఉన్న వాళ్లకోసం నాలుగు రోజులకే టెస్టులు మార్చాలన్నారు. అలాగే టెస్ట్ మ్యాచ్లను గురువారం నుంచి ఆదివారం వరకు నిర్వహించాలని కూడా సరికొత్త డిమాండ్ పెట్టారు. అలా నిర్వహిస్తే టెస్ట్ మ్యాచ్ ల‌కు వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా ఐసీసీకి సూచనలు చేశారు. వీకెండ్ లో మైదానాలకు అభిమానులు భారీగా తరలివస్తారని తాను అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే 4 రోజుల టెస్ట్ మ్యాచ్ ప్రతిపాదనను గతంలో విరాట్ కోహ్లీ అలాగే సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. దాని వల్ల సాంప్రదాయ టెస్టుల మజా పోతుందన్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×