E-Paper
Advertisement

అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!

అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!
Advertisement

Boy Fights Wild Boar: ఒడిశా కటక్ జిల్లాలోని గోపాల్‌పూర్ గ్రామంలో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. అడవి పందిని ఎదుర్కొని 14 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు గంటన్నర పాటు క్రూరమృగంతో పోరాడి బాలుడు తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికులతో పాటు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలుడి సాహసంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

అసలేం జరిగిందంటే?

గ్రామానికి సమీపంలోని నాడికుండ కాలువ వద్దకు సుమన్ బెహరా అనే బాలుడు ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల చాటు నుంచి ఒక్కసారిగా ఒక అడవి పంది బయటకు వచ్చి బాలుడిపైకి దూసుకొచ్చింది. తొలుత షాకైన సుమన్.. అడవి జంతువులు నీటిలోకి రావు అనే నమ్మకంతో ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే కాలువలోకి దూకాడు. అయితే ఆ పంది వెనకడుగు వేయకుండా నీటిలోకి కూడా దూకి అతనిపై దాడికి యత్నించింది.

మోకాళ్లలోతు నీటిలో హోరాహోరీ

Advertisement

దీంతో బాలుడికి, అడవి పందికి మధ్య మోకాళ్లలోతు నీటిలో హోరాహోరీ పోరు సాగింది. పందిని చూసి భయపడిపోకుండా సుమన్ తన సర్వశక్తులూ ఒడ్డి దానిపై పోరాటం చేశాడు. పొడవాటి కోరలు ఉన్న ఆ అడవి పందితో మోకాళ్ల లోతు నీటిలోనే కుస్తీ పడ్డాడు. జంతువు దాడి చేయకుండా దాని మెడను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని నొక్కిపెట్టాడు. అలా ఒక్క సెకను కూడా పట్టు సడలకుండా ఏకంగా గంటన్నరకు పైగా ఆ క్రూర జంతువును నీటిలోనే కదలకుండా అదుపు చేసి ఉంచాడు.

ఫైర్ సిబ్బంది రంగప్రవేశం

Advertisement

ఆ స్థితిలోనే సుమన్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే కాలువ వద్దకు పరిగెత్తుకువచ్చారు. బాలుడి పరిస్థితిని గమనించి.. 200 మీటర్ల దూరంలో ఉన్న బాంకీ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేవరకూ కూడా బాలుడు ఆ పందిని గట్టిగా పట్టుకునే ఉన్నాడు. అధికారులు.. యానిమల్ క్యాచర్ సహాయంతో పందిని బంధించి సుమన్‌ను సురక్షితంగా కాపాడారు.

Also Read: ఆస్పత్రిలో విచిత్రం.. సైలెంట్‌గా వచ్చి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లిన వీధి కుక్క!

అభినందనల వెల్లువ

అడవి పందితో 90 నిమిషాల పాటు పోరాడినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డ సుమన్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సను అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలమీదికి వచ్చిన క్షణంలో ఆ 14 ఏళ్ల బాలుడు చూపిన అసామాన్యమైన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలపై గ్రామస్తులతో పాటు అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి, ఎలా జరిగింది?

Tags

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×