E-Paper
Advertisement

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Philips S7221 5G: భారత్‌లో 5G ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ మరో కొత్త బ్రాండ్ ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు పేరున్న ఫిలిప్స్ ఇప్పుడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. Philips S7221 పేరుతో రానున్న ఈ ఫోన్ ఇప్పటికే అమెజాన్ ఇండియాలో మైక్రోసైట్ ద్వారా కనిపించింది. అయితే లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

అమెజాన్‌లో లిస్టింగ్..

Philips S7221 త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి అందుబాటులోకి వస్తుందని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది. 6GB, 8GB ర్యామ్‌తో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది వచ్చే అవకాశం ఉంది.

120Hz డిస్‌ప్లే..

Advertisement

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించనున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో పాటు Ultra Max Audio ఫీచర్ కూడా ఉండనుంది. దీంతో వీడియోలు, సినిమాలు, మ్యూజిక్ వినే సమయంలో మెరుగైన ఆడియో అనుభవం లభించే అవకాశం ఉంది.

Also Read: సోనీ నుంచి కొత్త 5G ఫోన్.. 120Hz OLED డిస్‌ప్లే, 50MP కెమెరా.. ధర ఎంతంటే?

64MP కెమెరా..

Advertisement

ఇక కెమెరాల విషయానికి వస్తే.. Philips S7221 వెనుక భాగంలో 64MP AI ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంటుంది.

డిజైన్, ఇతర ఫీచర్లు..

Philips S7221 సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఫ్లాట్ ఫ్రేమ్, గుండ్రటి మూలలతో ఫోన్ డిజైన్ ఉంటుంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది. ధరను బట్టి చూస్తే ఇది బడ్జెట్ 5G ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లాంచ్ తేదీ, ధరపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: యాపిల్ మాస్టర్ ప్లాన్.. ఐఫోన్ కంటే ముందే మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త డివైజ్!

Tags

Related News

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది!

Vivo X500 Pro Max వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

5 ఏళ్ల తర్వాత కూడా 80% బ్యాటరీ కెపాసిటీ.. Honor 600S 5Gలో మరెన్నో అదిరిపోయే ఫీచర్లు!

మార్కెట్లో ఎన్నో స్మార్ట్‌వాచ్‌లు ఉన్నా.. శాంసంగ్‌లో మాత్రమే ఉండే 3 ప్రత్యేక ఫీచర్లు!

పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌లు, అలర్ట్‌లు మళ్లీ చూడాలా ?

ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా? మీ పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి!

బయటి శబ్దాలకు చెక్ పెట్టే ఏఎన్‌సీ.. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

Big Stories

Advertisement
×