E-Paper
Advertisement

ఉద్యోగం ఊడింది.. కానీ రూ. 9 లక్షల ఆఫర్ వచ్చింది! లేఆఫ్స్‌లో ట్రెండ్ సెట్ చేసిన కాన్వా

ఉద్యోగం ఊడింది.. కానీ రూ. 9 లక్షల ఆఫర్ వచ్చింది! లేఆఫ్స్‌లో ట్రెండ్ సెట్ చేసిన కాన్వా
Advertisement

Canva Layoffs: ఒక కంపెనీ ఉద్యోగులను లేఆఫ్ చేస్తే ఏం చేస్తుంది? ముందు గా మెయిల్ పంపిస్తుంది… ఆ తర్వాత ల్యాప్‌టాప్ యాక్సెస్ కట్ చేస్తుంది. కనీసం ఆఫీస్‌లోకి కూడా రానివ్వదు. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ… ఆరు నెలల జీతం ఇస్తోంది. చేతిలో ఉన్న కంపెనీ మ్యాక్‌ బుక్‌ కూడా తీసుకోవడం లేదు. మరో ఏడాది పాటు లింక్‌డ్‌ఇన్‌ ప్రీమియమ్ సబ్‌ స్క్రిప్షన్, కెరీర్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తోంది. అంతేకాదు.. సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకునే ఉద్యోగులకు ఏకంగా 10 వేల డాలర్లు గ్రాంట్‌గా ఇస్తోంది. ఇదేదో ఉద్యోగుల కోసం కంపెనీ ప్రకటించిన బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? కాదు. ఇదంతా లేఆఫ్ ప్యాకేజీలో భాగం. ఆ కంపెనీ పేరు కాన్వా.. అసలు కాన్వా ఎందుకు ఉద్యోగులను తొలగిస్తోంది? ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తోంది? గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ కంపెనీల లేఆఫ్ ప్యాకేజీలతో పోలిస్తే కాన్వా ఆఫర్ ఎందుకు డిఫరెంట్‌గా ఉంది?

హిస్టరీలోనే ఫస్ట్‌ టైమ్‌ భారీగా లేఆఫ్స్‌

Advertisement

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ Canva.. ఆ కంపెనీ హిస్టరీలోనే ఫస్ట్‌ టైమ్‌ భారీగా లేఆఫ్స్‌ను అనౌన్స్‌ చేసింది. ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 22 శాతం మందిని లే ఆఫ్ చేసేందుకు డిసైడ్ అయ్యింది. అంటే 1,271 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. కంపెనీ కో-ఫౌండర్, సీఈఓ మెలానీ పెర్కిన్స్ ఈ విషయాన్ని ఉద్యోగులకు చెప్పారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కంపెనీ డెవలప్‌మెంట్‌ తగ్గిపోవడం ఈ లేఆఫ్స్‌కు కారణం. ప్రొడక్ట్, గ్రోత్, ప్లాట్‌ఫామ్ టీమ్‌లను ఒకే డివిజన్ కిందకు తీసుకురావడం, మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించడం, చిన్న టీమ్‌లతో వేగంగా నిర్ణయాలు తీసుకునేలా సంస్థను మార్చడం ఇందులో భాగం.

కాన్వా లేఆఫ్స్‌కు AI కారణమా..?

Advertisement

AI టూల్స్ వేగంగా డెవలప్‌ అవుతున్న ఈ టైమ్‌లో డిజైన్ రంగంలోనూ పోటీ పెరుగుతోంది. అయితే కాన్వా ఈ లేఆఫ్స్‌కు AI ఒక్కటే కారణమని ప్రకటించలేదు. ఇక్కడ మరో విషయం.. 1,271 మంది అంటే అందరూ ఉద్యోగాలు కోల్పోతున్నారని కాదు. కొందరి ఉద్యోగాల్లో మార్పులు, మరికొందరికి వేరే ప్రాంతాలకు రీలొకేషన్ కూడా ఉండవచ్చు.

కాన్వా అనౌన్స్‌ చేసిన లేఆఫ్ ప్యాకేజీ

ఇప్పుడు కాన్వా అనౌన్స్‌ చేసిన ఇంట్రెస్టింగ్‌ లేఆఫ్ ప్యాకేజీ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్యాకేజ్‌లో మొదటిది… ఆరు నెలల జీతం. ఉద్యోగం కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కనీసం ఆరు నెలల జీతం అందిస్తామని Canva ప్రకటించింది. ఇందులో చట్టపరంగా చెల్లించాల్సిన ప్రయోజనాలు కూడా ఉంటాయి. రెండోది… కంపెనీ ఇచ్చిన MacBookను ఉద్యోగులు తమ దగ్గరే ఉంచుకోవచ్చు. ఇది నిజంగా బంపరాఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా ల్యాప్‌టాప్ అవసరమే కదా. మూడోది… ఏడాది పాటు LinkedIn Premium సబ్‌స్క్రిప్షన్. కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కోవడానికి కెరీర్ కోచింగ్, రెజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లోనూ సహాయం కూడా చేయనుంది. ఇక నాలుగోది… హెల్త్ ఇన్సూరెన్స్. కంపెనీ ఈ సదుపాయం అందిస్తున్న దేశాల్లో మరో 12 నెలల పాటు హెల్త్‌కేర్ కవరేజ్ కొనసాగుతుంది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఏడాది పాటు ఎంప్లాయీ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్‌ ఆఫర్ ఏంటంటే.. గత ఏడాదిలో కంపెనీలో చేరిన ఉద్యోగులకు షేర్ వెస్టింగ్ విషయంలో ఉన్న ఒక ఏడాది వెయిటింగ్ నిబంధనను తొలగిస్తోంది. అన్నింటికంటే హైలైట్… సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి 10 వేల అమెరికన్ డాలర్ల గ్రాంట్ ఇస్తుంది. మన కరెన్సీలో దాదాపు రూ.9 లక్షలకు పైగా అన్నమాట. ఈ డబ్బుతో ఉద్యోగులు కొత్త బిజినెస్ ప్రారంభించవచ్చు లేదా కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టవచ్చు. దీనికి బదులుగా Canva ఎలాంటి ఈక్విటీ లేదా యాజమాన్య వాటా తీసుకోదు.

కాన్వా ఇచ్చిన ఆఫర్

ప్రపంచవ్యాప్తంగా బడా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇంకా తొలగిస్తున్నాయి కూడా. కానీ కాన్వా ఇచ్చిన ఆఫర్ ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. గూగుల్‌నే చూసుకుంటే.. 2023లో 12 వేల ఉద్యోగాలను తొలగిస్తున్న ప్రకటించిన Google, అమెరికాలోని ఉద్యోగులకు కనీసం 16 వారాల జీతాన్ని సెవరెన్స్‌గా ప్రకటించింది. కంపెనీలో పనిచేసిన ప్రతి అదనపు ఏడాదికి మరో రెండు వారాల జీతం ఇచ్చే విధానాన్ని కూడా ప్రకటించింది. ఆరు నెలల హెల్త్ ఇన్సూరెన్స్, కెరీర్ సపోర్ట్, ఇమ్మిగ్రేషన్ సాయం కూడా అందించింది. ఇక Meta విషయానికి వస్తే 2022లో 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినప్పుడు, మార్క్ జుకర్‌బర్గ్ 16 వారాల బేస్ పేతో పాటు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల జీతం ప్రకటించారు. ఆరు నెలల హెల్త్ ఇన్సూరెన్స్, మూడు నెలల కెరీర్ సపోర్ట్ కూడా అందించారు.

ఇక సేల్స్‌ఫోర్స్ విషయానికి వస్తే..

ఇక సేల్స్‌ఫోర్స్ విషయానికి వస్తే.. 2023లో ఉద్యోగులను తగ్గించినప్పుడు అమెరికాలోని ఉద్యోగులకు కనీసం ఐదు నెలల జీతం, హెల్త్ ఇన్సూరెన్స్, కెరీర్ సపోర్ట్ ప్రకటించింది. Amazon ఈ ఏడాదిలో ప్రకటించిన ఉద్యోగ కోతల్లో అమెరికాలోని చాలా మంది ఉద్యోగులకు ముందుగా 90 రోజుల పాటు కంపెనీలోనే మరో ఉద్యోగం వెతుక్కునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత అవసరమైన వారికి సెవరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయం అందిస్తామని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ కూడా అమెరికాలోని చాలా మంది ఉద్యోగులకు కనీసం 60 రోజుల బేస్ పే, ఉద్యోగ స్థాయి, సర్వీస్ ఆధారంగా గరిష్ఠంగా 39 వారాల వరకు జీతం, హెల్త్ కవరేజ్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఈ ప్యాకేజీలన్నీ ఒకేలా ఉండవు. దేశం, ఉద్యోగ స్థాయి, పనిచేసిన కాలం, కంపెనీ నిబంధనలను బట్టి మారుతుంటాయి.

సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి 10 వేల డాలర్ల

ఇప్పుడు ఈ కంపెనీలన్నింటినీ గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. Google, Meta, Salesforce వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు నెలల తరబడి జీతం, హెల్త్ ఇన్సూరెన్స్, కెరీర్ సపోర్ట్ అందించాయి. కానీ Canva ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌ను ఇచ్చేయడం.. ఏడాది పాటు LinkedIn Premium అందించడం.. సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి 10 వేల డాలర్ల గ్రాంట్ ఇవ్వడం.. ఇవన్నీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా వారి ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకున్న చర్యలుగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో కాన్వా నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయిన కొందరు మాజీ ఉద్యోగులు కూడా కంపెనీలో తమకు లభించిన సపోర్ట్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు.

మనం గుర్తుంచుకోవాల్సిన విషయం..

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. లేఆఫ్ అనేది ఒక ఉద్యోగికి కేవలం ఉద్యోగం పోవడం మాత్రమే కాదు. అతని కుటుంబానికి వచ్చే ఆదాయం ఆగిపోవడం.. పిల్లల చదువులు.. ఇంటి అద్దె.. ఈఎంఐలు.. వీటితో పాటు మన ఫ్యూచర్‌పై లేని క్లారిటీ. అలాంటి టైమ్‌లో కంపెనీలు ఉద్యోగులను ఎలా సాగనంపుతున్నాయన్నది కూడా చాలా ముఖ్యం.

కొత్త చర్చకు తెరలేసిన కాన్వా

ఏదేమైనా Canva నిర్ణయం ఒక కొత్త చర్చకు తెరలెపిందనే చెప్పాలి. కంపెనీలకు ఉద్యోగులను తొలగించే హక్కు ఉండవచ్చు. కానీ ఉద్యోగుల కష్టకాలంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ఉందా? లేఆఫ్ సమయంలో కనీసం ఆరు నెలల జీతం, హెల్త్ సపోర్ట్, కెరీర్ సహాయం వంటి ప్రయోజనాలు అన్ని కంపెనీల్లోనూ ఉండాలా? అనే డిస్కషన్‌ను మాత్రం స్టార్ట్ చేసింది.

Also Read: కాళేశ్వరం క్లైమాక్స్.. అసెంబ్లీలో కేసీఆర్ అడుగుపెడతారా? బీఆర్‌ఎస్ ప్లాన్ బి ఏంటి?

Tags

Related News

దలాల్ స్ట్రీట్‌లో దీపావళి పండగ.. ఫుల్‌జోష్‌లో మదుపరులు, పాత మార్క్‌ని టచ్ చేసిన సెన్సెక్స్-నిఫ్టీలు

పండుగ వేళ కొత్త మోసాలు.. కొంపముంచుతున్న ‘ఫ్రీ’ ఆఫర్లు.. NPCI కీలక హెచ్చరికలు!

దీపావళి గిఫ్ట్ అంటే ఇదీ.. ఏకంగా ‘ఐఫోన్ 16’లతో ఉద్యోగులకు సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌లో ఈ పొరపాటు చేస్తే అప్పు పెరుగుతూనే ఉంటుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వాల్‌‌స్ట్రీట్‌లో బేర్ వీర విహారం..ఆరేళ్ల తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ భారీ పతనం, వెంటాడిన ఏఐ భయాలు

దీపావళి బోనస్ వచ్చిందా? డబ్బంతా ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం ఇలా చేయండి

దీపావళి బిజినెస్ ఐడియా.. కేవలం రూ.10000తో కొవ్వత్తుల వ్యాపారం.. ఇలా చేస్తే భారీ ఆదాయం

Big Stories

Advertisement
×