Santali Bhashal Booklet – RBI : ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఆర్బిఐ (RBI) తాజాగా గిరిజనుల కోసం మరో ముందడుగు వేసింది. గిరిజనులకు ఆర్థిక అవగాహన కల్పించేందుకు సంతాలి భాషలో బుక్‌లెట్లను సిద్ధం చేస్తుంది. దేశంలో 90 సంవత్సరాల ఆర్‌బిఐ కార్యకలాపాలను స్మరించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బుక్లెట్లను సిద్ధం చేశామని ఆర్బిఐ తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించేందుకు వారి సొంత భాష అయిన సంతాలిలో ఆర్బీఐ బుక్లెట్లను సిద్ధం చేస్తుంది. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని.. ఇక్కడ సంతాలి భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారని అందుకే ఈ ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో సైతం ఈ బుక్లెట్స్ పంపిణీ చేస్తామని ఆర్బిఐ తెలిపింది. గిరిజన జనాభాలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒడిస్సా కార్యాలయంలో సంతాలి భాషలో ఐదు బుక్లెట్లను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచినట్టు ఆర్బిఐ వెల్లడించింది. కాగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కటక్‌లోని బాలి జాత్రలో ఈ బుక్‌లెట్లను విడుదల చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇండియా కేంద్ర బ్యాంక్ అనే విషయం తెలిసిందే. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారం కోల్కతాలో స్థాపించారు. తర్వాత ఈ బ్యాంక్ ను ముంబాయికి మార్చారు. నిజానికి ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్నప్పటికీ 1949లో జాతీయం చేశారు. అప్పటి నుంచే ఈ బ్యాంక్ భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. అయితే దేశంలో RBI కార్యకలాపాలు 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ బుక్ లెట్స్ ను రిలీజ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఇటీవల విద్యార్థుల మధ్య క్విజ్ పోటీల వంచి వరుస కార్యక్రమాలను కూడా నిర్వహించిందని.. భువనేశ్వర్ సంతాలీ మాట్లాడే ప్రజల మధ్య పంపిణీ కోసం సంతాలి (ఓల్ చికి లిపి) భాషలో ఐదు ఉపయోగకరమైన నిర్దిష్ట బుక్‌లెట్‌లను ప్రచురించాలమని ఆర్బిఐ వెల్లడించింది. ఆర్థిక వనరులతో పాటు సేవలు, మంచి ఆర్థిక పద్ధతులు, డిజిటల్ విషయాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో ఈ బుక్ లైట్స్ ను తీసుకొచ్చామని తెలిపారు ఇక పాఠశాల విద్యార్థులుగా పాటు రైతులు సీనియర్ సిటిజన్స్ కు సైతం అర్థమయ్యే విధంగా ఈ బుక్లెట్లను సిద్ధం చేశామని తెలిపారు.
ఆర్బిఐ తీసుకొచ్చి ప్రతి స్కీమ్స్ తో పాటు ఆర్థిక కార్యకలాపాలు, వడ్డీ రేట్లు ఇతర వివరాలు సైతం ఈ బుక్లెట్లో వివరంగా ఉన్నాయని తెలిపిన ఆర్.బి.ఐ వీటిని చదివే ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే రీతిలో ఉన్నాయని తెలిపింది. గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా గిరిజనులు సైతం పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని ఈ బుక్ లెట్స్ తీసుకొచ్చామని ఆర్బీఐ తెలిపింది.
ALSO READ : జొమాటోలో సినిమా టికెట్ బుకింగ్, లైవ్ షోస్, డైనింగ్, షాపింగ్.. ఇంకా ఎన్నో సేవలు