BigTV English

TTD controversy: తిరుమలలో అన్యమత ప్రచారం? ఆ రీల్స్ తీసింది అక్కడేనా? ఆరా తీస్తున్న టీటీడీ విజిలెన్స్

TTD controversy: తిరుమలలో అన్యమత ప్రచారం? ఆ రీల్స్ తీసింది అక్కడేనా? ఆరా తీస్తున్న టీటీడీ విజిలెన్స్

TTD controversy: తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందంటూ వదంతులు ఊపందుకున్నాయి. ఈ వదంతుల ధాటికి ఏకంగా టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందనే కోణంలో వివరాలు ఆరా తీస్తోంది.


తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధం. ఈ విషయం అందరికీ తెలిసిందే కూడా. కానీ పలువురు మహిళలు తిరుమలలోని పాపవినాశనం వద్ద అన్యమత ప్రచారానికి పాల్పడినట్లు వదంతులు వ్యాపించాయి. అంతేకాదు ఏకంగా తమ దైవానికి సంబంధించిన పాటలకు సదరు మహిళలు రీల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ రీల్స్ అక్కడ చేశారా లేదా అన్నది టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలాల్సి ఉంది.

పాప వినాశనం వద్ద 20 మంది వరకు అన్యమతస్తులు నిరంతరం ఉంటున్నట్లు సమాచారం. అయితే వీరికి స్థానిక ఫారెస్ట్ అధికారులు సహకారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవిత్రమైన ఏడుకొండల పై అన్యమత ప్రచారం సాగిందా లేదా అన్నది తేల్చేందుకు, టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. పాప వినాశనం వద్దకు వెళ్లి స్థానికులను సంబంధిత అధికారులు విచారిస్తున్నారు. అసలు అన్య మతస్తులు ఉన్నారా లేదా.. ఈ రీల్స్ ఎక్కడ చేశారు? అనే విషయాలను ఆరా తీసే పనులు వారు నిమగ్నమయ్యారు.


తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యత ప్రచారం నిషేధమైనప్పటికీ అప్పుడప్పుడు ఇటువంటి వదంతులు వ్యాపించడం సర్వసాధారణంగా మారింది. అయితే వదంతులకు ఎటువంటి ఆస్కారం లేకుండా టీటీడీ వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అంతేకాదు విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది.

ఎవరైనా తిరుమల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చెబుతోంది. అయితే సదరు మహిళలు తిరుమలలో రీల్స్ చేసినట్లు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఈ వీడియోలకు సంబంధించి అసలు వాస్తవం తెలియాలంటే టీటీడీ విజిలెన్స్ అధికారుల ప్రకటనతో బయటకు వెల్లడి కావాల్సి ఉంది.

Also Read: Lady Aghori: మధిరలో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. అక్కడ ఎవరిని కలిశారో తెలిస్తే.. షాక్ కావాల్సిందే!

ఈ మహిళలు పాపవినాశనం వద్ద గల హోటళ్ల వద్ద రీల్స్ చేసినట్లు అందరూ భావిస్తుండగా, అక్కడికి వీరు కూలి పనుల నిమిత్తం వస్తున్నట్లు కూడా చర్చ సాగుతోంది. మరి ఇంతకు వీరెవరు? అసలు అన్యమత ప్రచారం సాగిందా లేదా అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×