Chandrababu Ghibli Style: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదిగా షేర్ చేశారు. ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ తో కలిసి ఉన్న ఫోటోతో పాటు తన ఫ్యామిలీ పిక్ ను షేర్ చేశారు. వాటితో పాటు విజయవాడ వరదల సందర్భంగా ఓ బాధితురాలిని పరామర్శిస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఇవన్నీ ఘిబ్లీ స్టైల్ పిక్స్ కావడం విశేషం. ఆ ఫోటోలకు ‘Joining the Ghibli trend! Here’s my entry’ అని క్యాప్షన్ పెట్టారు. దానికి ఘిబ్లీ స్టైల్ అంటూ యాష్ ట్యాగ్ ఇచ్చారు. గత రెండు మూడు రోజులుగా చాలా మంది ఈ ఫోటోలను పోస్టు చేస్తున్నారు. ఇంతకీ ఘిబ్లీ స్టైల్ అంటే ఏంటి? అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం కూడా ఘిబ్లీ స్టైల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
యానిమేషన్ గేమింగ్ ఫోటోల్లా..
రీసెంట్ గా GPT 40 పేరుతో ఘిబ్లీ స్టైల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఏఐ ఇమేజ్ క్రియేటర్ వెర్షన్ ను నెటిజన్లు ఓ రేంజిలో వినియోగించుకుంటున్నారు. ఈ టూల్ ద్వారా ఈజీగా ఘిబ్లీ ఫోటోను క్రియేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు యానిమేషన్ చిత్రాల మాదిరిగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఫోటోలను పలు దేశాల్లోని గేమర్లు, డెవలపర్లు ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటి ఫోటోలను ఇష్టపడే వారు తాజా ఫీచర్ తో తమ ఫోటోలను డిఫరెంట్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఘిబ్లీ స్టైల్ ఫోటోలను ఎలా క్రియేట్ చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Joining the Ghibli trend! Here’s my entry. #ghiblistyle pic.twitter.com/Z2uZLuRsvf
— N Chandrababu Naidu (@ncbn) March 28, 2025
ఫ్రీగానే ఘిబ్లీ స్టైల్ ఫోటోల క్రియేషన్
ఘిబ్లీ స్టైల్ ఫోటోలను ఛాట్ జీపీటీ ద్వారా ఫ్రీగా తయారు చేసుకునే అవకాశం ఉంది. జీపీటీ ప్లస్, ప్రో సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు అపరిమితంగా ఫోటోలను ఘిబ్లీ స్టైల్ లో క్రియేట్ చేసుకోవచ్చు. లేని వారు పరిమిత సంఖ్యలో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓపెన్ఏఐ ఛాట్ జీపీటీ వినియోగదారుల కోసం GPT 4O ఇమేజ్ ఏఐ జనరేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ ఓపెన్ ఏఐ వీడియో మోడల్, సోరాలో కూడా అందుబాటులో ఉంది.
ఘిబ్లీ స్టైల్ ఫోటోలను ఎలా క్రియేట్ చేసుకోవాలంటే?
⦿ ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీలో ఇమేజ్ క్రియేషన్ కోసం ముందుగా ప్రాంప్ట్ బార్ లోని మూడు చుక్కలపై ట్యాప్ చేయాలి.
⦿ ఇందులో మీకు ఇమేజ్, కాన్వాస్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
⦿ ఐమేజెస్ మీద క్లిక్ చేయాలి. దానికి మీ ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి ఫోటో కావాలో చెప్పాలి.
⦿ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం మీ ఫోటో రెడీ అవుతుంది.
⦿ మీ ఫోటోలు సరదాగా, విభిన్నమైన రంగులతో ఆకట్టుకుంటాయి.
⦿ మీరు అనుకున్న ఫోటో వచ్చిన తర్వాత దాన్ని మీరు ఫోన్ లో లేదంటే కంప్యూటర్ లో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: వార్నీ.. హోంవర్క్ మెషీన్ కూడా వచ్చేసింది, పిల్లలకు ఇక పండుగే!