BigTV English

Homework Machine: వార్నీ.. హోంవర్క్ మెషీన్ కూడా వచ్చేసింది, పిల్లలకు ఇక పండుగే!

Homework Machine: వార్నీ.. హోంవర్క్ మెషీన్ కూడా వచ్చేసింది, పిల్లలకు ఇక పండుగే!

Homework: హోం వర్క్. విద్యార్థులకు చిరాకు కలిగించే అంశం. మార్నింగ్ స్కూల్ కు  వెళ్లి, సాయంత్రం వచ్చి, మళ్లీ హోం వర్క్ రాయాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతాయి. మరికొంత మంది హోం వర్క్ చేయకుండా స్కూల్ కు వెళ్లి టీచర్లతో తిట్లు పడతారు. మరికొంత మంది బెత్తంతో దెబ్బలు తింటారు. ఇంకొంత మంది తమ ఫ్రెండ్స్ లేదంటే పేరెంట్స్ తో హోం వర్క్ చేయించుకుంటారు. ఇలాంటి సందర్భంలో చాలా మంది హోం వర్క్ చేసేందుకు ఓ మిషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. హోం వర్క్ చేసే మిషన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మిషన్ ను కనిపెట్టింది కూడా భారతీయులే కావడం విశేషం. ఈ మిషన్ అందుబాటులోకి వస్తే పిల్లలకు హోంవర్క్ కష్టాలు తప్పే అవకాశం ఉంది.


హోంవర్క్ మిషన్ కనిపెట్టిన కేరళ విద్యార్థులు

హోం వర్క్ మిషన్ ను కేరళకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించారు. చెరుతురుతిలోని జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ లో రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగంలో చివరి సంవత్సరం విద్యార్థులు పి ఆర్ దేవదత్,  సిద్ధార్థ్ పునాతిల్ ఈ మిషన్ ను తయారు చేశారు. రాయడం వల్ల కలిగే అలసటను అధిగమించడానికి హోంవర్క్ యంత్రాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. అసైన్‌ మెంట్‌ లు,  అత్యవసర రికార్డులు రాయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందన్నారు. ఈ విద్యార్థులు ఏడాది క్రితం 3D ప్రింట్‌ లో రాయడం ప్రారంభించారు. ఈ యంత్రం పెన్నుతో రాసేలా రూపొందించబడింది. అంతేకాదు, ఒక పేజీ నిండుగా రాయగానే ఆటో మేటిక్ గా పేజీలను తిరిగేసేలా ఈ మిషన్ ను తయారు చేశారు.


హోం వర్క్ మిషన్ తో లాభమా? నష్టమా?

పాఠశాలలకు వెళ్లే పిల్లలకు హోం వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. క్లాసులో నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకునేందుకు హోంవర్క్ చేయడం చాలా అవసరం. అయితే, చాలా మంది పిల్లలు హోం వర్క్ ఎగ్గొట్టేందుకు రకరకాల ప్రత్నాలు చేస్తారు. అలాంటి వారికి ఈ హోం వర్క్ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ హోం వర్క్ మిషన్ 3D ప్రింటింగ్ ద్వారా ఎవరి చేతి రాత ఎలా ఉంటుందో? లాగే రాసే అవకాశం ఉంటుంది. ఏ విద్యార్థి హోంవర్క్ చేస్తే హ్యాండ్ రైటింగ్ ఆ అబ్బాయి మాదిరిగానే ఉంటుంది. టీచర్లు కూడా ఇది మిషన్ రాసింది అని గుర్తించలేరు. ఇలాంటి మిషన్ వల్ల విద్యార్థులకు చేతిరాత కష్టాలు తప్పుతాయి. కానీ, వాటిని గుర్తుంచుకోలేరు. క్లాస్ లో చదివింది గుర్తుంచుకోవాలనే ఇంటికెళ్లి హోం వర్క్ చేయాలి. అలా కాదని మిషన్ తో హోం వర్క్ చేయిస్తే, విద్యార్థులకు నష్టమే తప్ప లాభం ఉండదంటున్నారు నిపుణులు. అత్యవసరమైన నోట్స్ రాయడానికే తప్ప, రెగ్యుల్ హోంవర్క్ దీనితో చేయిస్తే విద్యార్థులకు మంచిది కాదంటున్నారు.

Read Also: నేను ఎవరు? అని చాట్ జీపీటీని అడిగిన వ్యక్తి.. దాని జవాబు చూసి పోలీస్ స్టేషన్ కు పరుగు!

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×