Plastic In Kitchen: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వంటగదిలో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి అంతే కాకుండా వంటకాలు తయారు చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడుతుంటారు.
ఓవెన్‌లో ఏదైనా వేడి చేయడానికి కూడా ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగిస్తే.. మాత్రం ఇది మరింత ప్రమాదకరం అని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం నేరుగా ప్రభావితం అవుతుంది. ప్లాస్టిక్‌ను వేడి చేసిన వెంటనే.. దాని నుండి విడుదలయ్యే విషపూరిత కారకాలు మీ ఆహార పదార్థాలకు అంటుకుంటాయి. తర్వాత ఆహారం ద్వారా మీ కడుపులోకి ప్రవేశిస్తాయి . కాబట్టి మీరు ప్లాస్టిక్ పాత్రలను వాడకుండా ఉండటం ముఖ్యం.
హార్మోన్ల సమతుల్యత:
మీరు కూడా మీ ఇంట్లో ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగిస్తుంటే.. మాత్రం వెంటనే ఆపేయండి. ప్రస్తుతం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత చాలా సాధారణమై పోయింది. దీని వల్ల పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా.. ఊబకాయం కూడా విపరీతంగా పెరుగుతోంది. దీనికి కారణం మీరు వాడే ప్లాస్టిక్ పదార్థాలే. ప్లాస్టిక్ వస్తువుల నుండి బిస్ఫినాల్ , థాలేట్స్ వంటి హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
షుగర్ ప్రమాదం:
ప్లాస్టిక్ పాత్రలలో తినడం లేదా ప్లాస్టిక్ వస్తువులలో నిల్వ చేసిన పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని మీకు తెలుసా ? మీరు ప్లాస్టిక్ ప్లేట్‌లలో తినేటప్పుడు.. మీ కడుపులోకి వెళ్లే రసాయనాలు మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అంతే కాకుండా వీటి వల్ల మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించడం ముఖ్యం. ముఖ్యంగా వేడి పదార్థాలను ప్లాస్టిక్ పాత్రల్లో అస్సలు తినకూడదు.
ఆస్తమా:
ప్లాస్టిక్‌ను వేడి చేసినప్పుడు.. దాని నుండి థాలేట్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఇది ఆస్తమాతో బాధపడేవారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి థాలేట్ హాని కలిగిస్తుంది. ఈ రసాయనం వల్ల మీకు ఆస్తమా బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రసాయనం మీ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆస్తమా సమస్య పెరుగుతుంది.
క్యాన్సర్:
ప్లాస్టిక్ బ్లాక్సుల్లో పెట్టిన ఆహార పదార్థాలు తినడం ప్రమాదకరం అని అనేక పరిశోధనల్లో రుజువైంది. వీటి ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ BPA , ఇతర హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి క్యాన్సర్‌ను ప్రోత్సహిస్తాయి. రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
Also Read: మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
కాలేయం, కిడ్నీలకు హానికరం:
ప్లాస్టిక్ మన శరీరానికి చాలా ప్రమాదకరం. ఇది మన శరీర భాగాలకు చాలా ప్రమాదకరమైనది అని నిరూపించబడింది. ప్లాస్టిక్ మన కాలేయం , మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకు ప్లాస్టిస్ వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యం.
నాడీ సంబంధిత సమస్యలు:
సరైన సమయంలో ప్లాస్టిక్ వస్తువులను వాడటం మానేయకపోతే.. మీరు మెదడు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువుల్లో ఉండే రసాయనం నెమ్మదిగా మీ శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి బలహీనపడి ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి ఇకనుండైనా ప్లాస్టిక్ కు బదులుగా గాజు, స్టీల్ పదార్థాలను వాడటం అలవాటు చేసుకోండి.