E-Paper
Advertisement

ధర తక్కువే కానీ, సౌండ్ మాత్రం ఊరమాస్.. ఈ రేంజ్ బేస్ ఇచ్చే సౌండ్ బార్‌ను ఎప్పుడైనా చూశారా?

ధర తక్కువే కానీ, సౌండ్ మాత్రం ఊరమాస్.. ఈ రేంజ్ బేస్ ఇచ్చే సౌండ్ బార్‌ను ఎప్పుడైనా చూశారా?
Advertisement

Crossbeats Blaze B1100: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేంత సమయం ఉండటం లేదు. దీంతో ఇంట్లోనే థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం క్రాస్‌బీట్స్ నుంచి వచ్చిన సరికొత్త Blaze B1100 Dolby Audio Home Theater టీవీ సౌండ్ చాలడం లేదనిపించినా, సినిమా చూస్తున్నప్పుడు ఆ బేస్ తాలూకు వైబ్రేషన్స్ మిస్ అవుతున్నా.. ఈ సౌండ్‌బార్ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. మరి దీని ఫీచర్లు, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందామా..

అదిరిపోయే సౌండ్ క్వాలిటీ:

సాధారణంగా మనం టీవీల్లో సినిమాలు చూసేటప్పుడు డైలాగ్స్ సరిగ్గా వినపడవు. లేదంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోతుంది. కానీ ఈ బ్లేజ్ B1100లో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల ప్రతి చిన్న శబ్దం కూడా చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా ఆ కథలోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. పాటలు వినేటప్పుడు ఆ క్లారిటీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

Also Read: ఇంట్లోనే Vitamin-D అందించే Philips సీలింగ్ లైట్.. ఫీచర్లు అద్భుతం కానీ, ఆ ఒక్కటే మైనస్!

బేస్ పవర్ నెక్ట్స్ లెవెల్:

ఈ హోమ్ థియేటర్ లోని సబ్‌వూఫర్ ఇచ్చే బేస్ ఎఫెక్ట్ నిజంగా అద్భుతం. యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు వచ్చే ఆ ధంప్, డ్రమ్స్ సౌండ్స్ రూమ్‌ని ఒక చిన్న థియేటర్‌లా మార్చేస్తాయి. ఎక్కువ వాల్యూమ్ పెట్టినా కూడా సౌండ్ అస్సలు డిస్టర్బ్ అవ్వదు. ఇల్లు అదిరిపోయేలా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్:

Advertisement

ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. టీవీ కింద పెడితే హాల్‌కి ఒక మంచి లుక్ వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. దీనిలో బ్లూటూత్, ఆక్స్, హెచ్‌డిఎమ్‌ఐ లాంటి అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్ లేదా లాప్‌టాప్‌ని సెకన్లలో కనెక్ట్ చేసుకుని మనకు నచ్చిన ప్లేలిస్ట్‌ని ప్లే చేసుకోవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఛాయిస్:

బడ్జెట్ ధరలో మంచి బ్రాండెడ్ హోమ్ థియేటర్ సిస్టమ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఓటీటీలో సినిమాలు ఎక్కువగా చూసేవారికి, ఇంట్లోనే చిన్నపాటి పార్టీలు చేసుకునే యువతకు ఇది బాగా సెట్ అవుతుంది. తక్కువ స్పేస్‌లో ఎక్కువ సౌండ్ అవుట్‌పుట్ ఇచ్చే మంచి ఆడియో సిస్టమ్ కోసం చూస్తుంటే.. బ్లేజ్ B1100ని నిరభ్యంతరంగా పరిశీలించవచ్చు.

Also Read: 800W పవర్, డాల్బీ ఆడియో.. తక్కువ ధరలో iBall తెచ్చిన సరికొత్త Cinebar 560!

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×