E-Paper
Advertisement

స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా? ఫిట్‌నెస్ ట్రాకర్ల వెనక ఉన్న షాకింగ్ నష్టాలు తెలుసా!

స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా? ఫిట్‌నెస్ ట్రాకర్ల వెనక ఉన్న షాకింగ్ నష్టాలు తెలుసా!
Advertisement

Disadvantages Of Fitness Trackers: ఈ రోజుల్లో చేతికి ఒక స్మార్ట్‌వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ లేనిదే చాలా మంది బయట అడుగు పెట్టడం లేదు. ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని క్యాలరీలు కరిగాయి, హార్ట్ రేట్ ఎంత ఉంది అని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ గ్యాడ్జెట్స్ హెల్ప్ అవుతాయనేది ఎంత నిజమో, వీటి వల్ల తెలియకుండానే.. అనేక నష్టాలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయనేది కూడా అంతే నిజం. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ల వల్ల కలిగే ప్రతికూలతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .

ఫిట్‌నెస్ ట్రాకర్ల సైడ్ ఎఫెక్ట్స్:
ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి టెక్నాలజీ వాడటం మంచిదే కానీ.. దానికి పూర్తిగా బానిసలైతే వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్‌వాచ్‌ల వల్ల కలిగే ముఖ్యమైన ప్రతికూలతలు ఇవే..

Advertisement

1. పెరిగిపోతున్న మానసిక ఆందోళన :
ఫిట్‌నెస్ ట్రాకర్ల వల్ల వచ్చే అతి పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఒత్తిడి.వాచ్‌లో హార్ట్ రేట్ కొంచెం పెరిగినా.. లేదా ఒక రోజు 10 వేల అడుగులు నడవలేకపోయినా చాలా మంది విపరీతంగా టెన్షన్ పడిపోతున్నారు. గ్యాడ్జెట్ చూపించే రీడింగ్స్ ఆధారంగా తమకు ఏదో అయిపోతోందని భయ పడటం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతోంది. దీన్నే హెల్త్ అంక్జైటీ అంటారు.

2. 100% కరెక్ట్ కాదు:
చాలా స్మార్ట్‌ వాచ్‌లు చూపే డేటా పూర్తిగా ఖచ్చితమైనది కాదు. మీరు బైక్ మీద వెళ్తున్నా లేదా చేతులు ఊపుతున్నా అది స్టెప్స్ లాగా కౌంట్ చేసేస్తుంది. అలాగే క్యాలరీల బర్నింగ్ లెక్కలు కూడా కేవలం అంచనా మాత్రమే. ఈ తప్పుడు డేటాను నమ్మి చాలా మంది తమకు నచ్చినట్లు డైట్ మార్చేస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.

Advertisement

3. నిద్రను పాడుచేసే స్లీప్ ట్రాకింగ్:
రాత్రి పూట మీ స్లీప్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాచ్ పెట్టుకుని పడుకుంటారు. కానీ.. పొద్దున్నే లేవగానే వాచ్ స్క్రీన్‌పై ‘మీ నిద్ర బాలేదు’ అని మెసేజ్ వస్తే.. ఆ రోజంతా మూడ్ పాడైపోతుంది. నిజానికి ప్రశాంతంగా నిద్రపోవాల్సిన సమయంలో చేతికి గ్యాడ్జెట్ ఉండటం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది.

ఖర్చు , ప్రైవసీ రిస్క్:
ఖర్చుతో కూడుకున్నది: మంచి బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కొనాలంటే.. వేల రూపాయలు పెట్టాలి. పైగా ప్రతి రెండేళ్లకు కొత్త మోడల్స్ రావడం, పాత వాటి సాఫ్ట్‌వేర్ స్లో అవ్వడం వల్ల ఇదొక నిరంతర ఖర్చులా మారుతుంది. దీనికి తోడు యాప్ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు అదనం.

ప్రైవసీ: మీ రోజువారీ కదలికలు, లొకేషన్, హార్ట్ రేట్, పర్సనల్ హెల్త్ డేటా అంతా సదరు కంపెనీల సర్వర్లలో స్టోర్ అవుతుంది. ఈ డేటా లీక్ అయితే మీ ప్రైవసీ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.

చర్మ సమస్యలు :రోజంతా, రాత్రంతా వాచ్‌ను చేతికి గట్టిగా పెట్టుకోవడం వల్ల ఆ భాగంలో గాలి ఆడదు. చెమట పట్టడం వల్ల స్మార్ట్‌వాచ్ స్ట్రాప్స్ ఉన్న చోట స్కిన్ అలర్జీలు, రాషెస్ , దురద వంటి చర్మ సమస్యలు వస్తుంటాయి.

ఫిట్‌నెస్ ట్రాకర్స్ అనేవి కేవలం మీకు ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే, అవే అంతిమ తీర్పు కాదు. మీ శరీరం ఇచ్చే సిగ్నల్స్ (ఆకలి, అలసట, ప్రశాంతత) కంటే వాచ్ ఇచ్చే నంబర్లను ఎక్కువగా నమ్మకండి. గ్యాడ్జెట్స్‌ ఒక లిమిట్‌లో వాడండి. మీ ఆరోగ్య నియంత్రణను పూర్తిగా టెక్నాలజీ చేతుల్లో పెట్టకండి.

Related News

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

అమ్మ చేతి కమ్మని వంట.. కిచెన్‌ నుంచి వచ్చే ఆ మసాలాల సువాసనలు, ఇప్పుడేవీ?

ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!

80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?

80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

Big Stories

Advertisement
×