E-Paper
Advertisement

రోజంతా ఇంట్లోనే ఉంటావుగా.. ఏం చేస్తావు? అనేవారికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ!

రోజంతా ఇంట్లోనే ఉంటావుగా.. ఏం చేస్తావు? అనేవారికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ!
Advertisement

Housewives: ఇంటి నాలుగు గోడల మధ్య ఏ రోజూ సెలవు లేకుండా, ఎలాంటి జీతం ఆశించకుండా అహర్నిశలు కష్టపడే గృహిణుల సేవలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సముచిత గౌరవాన్ని కల్పించింది. ఇంట్లో మహిళలు చేసే సేవలు, పడే కష్టాలు వెలకట్టలేనివని, వారు కుటుంబం కోసం పడే శ్రమను కేవలం డబ్బుతో కొలవలేం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఒక కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు కామెంట్స్

Advertisement

రోడ్డు ప్రమాదంలో మరణించిన గృహిణి కుటుంబానికి చెల్లించాల్సిన బీమా పరిహారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. సాధారణంగా బీమా కంపెనీలు… ఉద్యోగం చేయని మహిళలు చనిపోతే, వారిని ఆదాయం లేని వారిగా చూపించి తక్కువ పరిహారం ఇస్తుంటాయ్.

భీమా పరిహారం పెంచాలంటూ కీలక తీర్పు

Advertisement

దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు, ఒక గృహిణి ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేసే పనులను లెక్కిస్తే, ఆమె ఒక మేనేజర్, చెఫ్, క్లీనర్, ట్యూటర్, నర్స్.. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది. కనీసం తక్కువలో తక్కువ నెలకు 30 వేల రూపాయల విలువైన పని చేస్తారని సుప్రీం లెక్కగట్టంది. కాబట్టి ఆమె శ్రమను ఉద్యోగుల జీతంతో పోల్చలేమని, గృహిణుల అంచనా ఆదాయాన్ని తక్కువగా లెక్కించడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేస్తూ భారీ పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం. 2001 నాటి కేసులో బీమా పరిహారం పెంచాలంటూ కీలక తీర్పు వెలువరించింది.

గృహిణుల పాత్రపై సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు మహిళల గురించి చేసిన కామెంట్లు, ఇచ్చిన తీర్పు, దేశ నిర్మాణంలో భాగస్వామి అంటూ చెప్పిన విషయాలు.. సమాజంలో విస్తృత చర్చకు దారి తీసింది. గృహిణులు ప్రత్యక్షంగా డబ్బు సంపాదించకపోవచ్చు. కానీ వారు ఇంట్లో పనులు చేయడం వల్లే పురుషులు బయటకు వెళ్లి ప్రశాంతంగా ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నడవడానికి మహిళల కనిపించని శ్రమే మూలస్తంభం అన్న మాటను మర్చిపోవద్దు.

365 రోజుల డ్యూటీ.. సెలవులే లేని గృహిణి జీవితం

ఉద్యోగులకు వీకెండ్స్, పండుగ సెలవులు ఉంటాయ్. మరి గృహిణికి సంవత్సరంలో 365 రోజులూ డ్యూటీనే. పండుగలు, పబ్బాలువస్తే ఆమెకు పని భారం మరింత పెరుగుతుందే తప్ప రెస్ట్ అనేదే ఉండదు. పిల్లల పెంపకం, అత్తమామలు, తల్లిదండ్రుల సేవ, వంట చేయడం, ఇల్లు సర్దడం వంటి పనులను మహిళలు కేవలం మెకానికల్ గా ఏదో బోరింగ్ గా కాకుండా ప్రేమ, బాధ్యతతో చేస్తారు. ఈ ప్రేమ ఆప్యాయతలకు రేటు కట్టలేం. ఎంత ఇచ్చినా తక్కువే అన్నది అంతా గుర్తుంచుకోవాలన్న చర్చ జరుగుతోంది.

రోజంతా ఇంట్లోనే ఉంటావుగా!

ఇళ్లల్లో మహిళలు కష్టపడుతున్న తీరుపై చాలా సర్వేలు చాలా విషయాలను ఇప్పటికే చెప్పాయ్. భారత్ లో ఒక పురుషుడు రోజుకు సగటున కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఇంటి పనులకు కేటాయిస్తుంటే, మహిళలు సగటున 5 నుంచి 6 గంటల టైంను ఇంటి పనుల కోసమే కేటాయిస్తున్నారు. పైగా ఇంత చేసినా ఆమెకు గుర్తింపు దక్కట్లేదు. రోజంతా ఇంటి పనులతో ఎంత కష్టపడ్డా.. రోజంతా ఇంట్లోనే ఉంటావుగా, ఏం చేస్తున్నావు? అన్న ఒక్క మాటతో సమాజం, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా ఆమె కష్టాన్ని నీరుగార్చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇక ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఉద్యోగాలు చేసే మహిళల పరిస్థితి మరీ దారుణం. వారు అటు ఆఫీసు బాధ్యతలు చూస్తూనే, ఇటు ఇంటి పనుల భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది.

కనిపించని శ్రమకు గుర్తింపు కోరిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం బీమా పరిహారాలకే పరిమితం కాదు. ఇది సమాజంలో మేధోమథనానికి తెరలేపింది. ఇంటి పని అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు, అది ఉమ్మడి కుటుంబ బాధ్యత అనే భావన పురుషులలో రావాలన్న మెసేజ్ సొసైటీలోకి బలంగా వెళ్తోంది. సుప్రీంకోర్టు చెప్పినట్లు, మహిళలు ఇళ్లల్లో చేసే సేవలను కేవలం ఉచితంగా చూడటం మానేసి, వారికి గౌరవం, గుర్తింపు ఇచ్చేలా అభిప్రాయాలు మారాలంటున్నారు.

Also Read: రోడ్లపై ‘V2V’ విప్లవం.. వాహనమే చెబుతుంది.. ‘నేనొస్తున్నా జాగ్రత్త’ అని!

Related News

అవినీతి అనకొండలకు ఇక గజగజ.. బినామీ ఆస్తులపై IT, ACBల డబుల్ స్ట్రోక్!

తెలంగాణలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్.. పొలిటికల్ రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్!

గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!

నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

రేవంత్‌పై బీజేపీ బొద్దింక‌ల అస్త్రం.. రాజీనామా, విద్యాశాఖ మంత్రి.. స‌ర్కార్‌పై గురి!

Big Stories

Advertisement
×