E-Paper
Advertisement

Crypto Scam: క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్త.. భారీ సంఖ్యలో నకిలీ క్రిప్టోవెబ్‌సైట్లు గుర్తింపు

Crypto Scam: క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్త.. భారీ సంఖ్యలో నకిలీ క్రిప్టోవెబ్‌సైట్లు గుర్తింపు
Advertisement

Cryptocurrency Scam| బంగారం ధరలు ఆకాశమే హద్దుగా వేగంగా పెరుగుతున్నాయి. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు క్రిప్టోకరెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయని ఇన్వెస్టర్లకు హెచ్చరిక జారీ చేసింది. చాలా మంది ఫేక్ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లను నమ్మి డబ్బు పోగొట్టుకున్నారు. స్కామర్లు హై రిటర్న్స్, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫర్ చేస్తారు. ఈ హామీలు పూర్తిగా ఫేక్. అందుకే ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది.

ఫేక్ క్రిప్టో వెబ్‌సైట్లను గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఆర్థిక మోసాల విచారణ చేసే భారత ప్రభుత్వ విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవలే 26 నకిలీ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్లను బయటపెట్టింది. ఈ సైట్లు దేశవ్యాప్తంగా చాలాకాలం పని చేశాయి. లీగల్, ట్రస్ట్‌వర్తీ ప్లాట్‌ఫామ్‌లుగా నటించాయి. అందులో వేలాది మంది ఇన్వెస్టర్లు ట్రాప్‌లో పడ్డారు. ఈడీ ప్రజలకు ఈ సైట్లను వెంటనే అవాయిడ్ చేయమని సలహా ఇచ్చింది.

ఈడీ ఫ్లాగ్ చేసిన వెబ్‌సైట్లు ఏంటి?

Advertisement

goldbooker.com, fincorp.com,wozur.comలను ఫేక్ ప్లాట్‌ఫామ్‌లుగా ఈడీ గుర్తించింది. ఈడీ జారీ చేసిన జాబితాలో theapexpower.com, mygoldrev.com కూడా ఫ్రాడ్ సైట్లుగా ఉన్నాయి. అలాగే Cryptobrite.com, cryptexify.com వెబ్ సైట్లు కూడా ఒకే నెట్‌వర్క్‌లో ఉన్నాయి. Goldxcapital.com, hawkchain.com వెబ్ సైట్లపై కూడా ఇన్వెస్టిగేషన్‌ జరుగుతోంది.
Cubigains.com, paymara.com ఫేక్ ప్రాఫిట్స్ చూపించి పెట్టుబడిదారులను ఆకర్షించాయి. Bitcodeals.com, growmore.com నకిలీ ట్రేడింగ్ ఫలితాలు చూపించాయి. ఈ జాబితాలో ఉన్న bitminerclub.com, bitrobix.com కూడా లిస్ట్‌లో ఉన్నాయి. Primetrades.com, zylotrade.com వెబ్ సైట్లు కూడా ఈ స్కామ్‌లో భాగం. అన్నీ ఫేక్ ప్రాఫిట్స్ చూపించి పెట్టుబడిదారులను మోసం చేశాయి.

క్రిప్టో స్కామ్ నెట్‌వర్క్ ఎలా పని చేసింది?

ఈ స్కామ్ నెట్‌వర్క్ 2015 నుంచి యాక్టివ్‌గా ఉందని అధికారులు కనుగొన్నారు. ఈ కుంభకోణం పాంజీ స్కీమ్ మోడల్ (చిట్ ఫండ్ ఫ్రాడ్) తరహాలో సాగుతోంది. ట్రెడిషనల్ ఫ్రాడ్‌ను మోడర్న్ సోషల్ ఇంజినీరింగ్‌తో కలిపారు. ముందు చిన్న మొత్తాలలో లాభాలు చూపించి పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుందుకు ప్రోత్సహించారు. అలాగే బాధితులను ఫ్రెండ్స్, బాధితులను కూడా ఇందులో పెట్టుబడి చేసేందుకు చెప్పాలని అడిగారు.

క్రిప్టో స్కామ్‌లో సోషల్ మీడియా పాత్ర

Advertisement

స్కామర్లు వాట్సాప్‌లో ఫేక్ ట్రేడింగ్ గ్రూప్స్ క్రియేట్ చేశారు. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించారు. నకిలీ ఎక్స్‌పర్ట్స్ డైలీ ప్రాఫిట్ స్క్రీన్‌షాట్స్ షేర్ చేశారు. ఇవన్నీ రియలిస్టిక్ గా, నమ్మశక్యంగా కనిపించాయి. అందుకే చాలా మంది గుడ్డిగా నమ్మేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో మరింత డిపాజిట్స్ చేశారు.

Also Read: మార్కెట్లో త్వరలోనే ఎగిరే కార్లు.. ధర ఎంతంటే

విత్‌డ్రాయల్స్ సమయంలో ఫ్రాడ్

రియల్ ఫ్రాడ్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్స్ సమయంలో ప్రారంభమైంది. వెబ్‌సైట్లు ట్యాక్స్ చార్జెస్ కోసం ఎక్స్ట్రా పేమెంట్స్ డిమాండ్ చేశాయి. కొన్ని క్లియరెన్స్ లేదా స్టాట్యూటరీ ఫీస్ అడిగాయి. బాధితులు లాభాలు వస్తాయని ఆశపడి పేమెంట్లు చేశారు. పేమెంట్ చేసిన తర్వాత అకౌంట్స్ పర్మనెంట్‌గా ఫ్రీజ్ అయ్యాయి. ఇన్వెస్టర్లు తమ డబ్బుని విత్ డ్రా చేసేందుకు పూర్తి యాక్సెస్ పోగొట్టుకున్నారు.

క్రిప్టో ఫ్రాడ్ ఫైనాన్షియల్ ప్రభావం

ఈడీ అధికారులు బాధితుల నష్టాలను పూర్తిగా వెల్లడించలేదు. ప్రారంభ అంచనాల ప్రకారం.. కోట్ల రూపాయల నష్టం జరిగింది. కొన్ని నెట్‌వర్క్స్ రూ.100 కోట్లకు మించిన ఫ్రాడ్ చేశాయి. 2024, 2025లో క్రిప్టో స్కామ్స్ భారీగా పెరిగాయి. ఈడీ చాలా కేసులను డిజిటల్ ఫైనాన్షియల్ క్రైమ్స్‌కు లింక్ చేసింది. గత ఏడాది రూ.30,000 కోట్లకు మించిన అసెట్స్ అటాచ్ చేశారు.

స్కామ్స్ వెనుక ఫారిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

స్కామ్ వెబ్‌సైట్లు ఫారిన్ లొకేషన్స్ నుంచి ఆపరేట్ అయ్యాయి. టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విదేశాల్లో ఉంది. సౌత్‌ఈస్ట్ ఏషియన్ దేశాల్లో సర్వర్లు హోస్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ఈ దేశాల్లో సైబర్ నేర చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి. స్కామర్లు.. షెల్ కంపెనీలు, హవాలా రూట్స్, పీ2పీ క్రిప్టో ట్రాన్స్‌ఫర్స్ ఉపయోగించారు. డబ్బు ట్రాక్ చేయడం చాలా కష్టమైంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సలహా

ఈడీ ఆన్‌లైన్‌లో అలర్ట్‌గా ఉండమని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లను సూచించింది. డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ప్లాట్‌ఫామ్‌లను రీసెర్చ్ చేయండి. హై రిటర్న్స్ ఆఫర్ చేసే అపరిచిత వెబ్‌సైట్లను అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్స్ గురించి వెంటనే ఆరా తీయండి. మోసపూరితంగా అనిపిస్తే సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజేయండి. అవగాహనతో అన్ని చెక్ చేస్తే భారీ ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు.

క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్ హై రిస్క్ కలిగి ఉన్నాయి. ఫేక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎక్కువ లాభాల ఆశచూపి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. ప్రభుత్వ ఏజెన్సీలు వీటిని నిరంతరం గమనిస్తున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాయి.

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×