Big Stories

IPL : నితీశ్, రింకూ అదుర్స్.. చెన్నైపై కోల్‌కతా విక్టరీ..

IPL : కోల్ కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ .. చెన్నైను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చెన్నై జట్టులో శివం దూబె (48 నాటౌట్ ), డెవాన్ కాన్వే (30) రాణించారు. జడేజా (20), రుతురాజ్ గైక్వాడ్ (17), రహానే (16) భారీ స్కోర్ సాధించలేదు. దీంతో ధోని సేన 150 పరుగులు కూడా చేయలేకపోయింది.

- Advertisement -

కోల్ కతా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా నరైన్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్ధుల్ ఠాకూర్, వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు.

- Advertisement -

లక్ష్య చేధనలో తొలుత కోల్ కతా తడబడింది. జేసన్ రాయ్ (12), గుర్బాజ్( 1), వెంకటేష్ అయ్యర్ (9) వికెట్లను 33 పరుగులకే కోల్పోయింది. ఈ మూడు వికెట్లు దీపక్ చహర్ కు దక్కాయి. ఈ దశలో కెప్టెన్ నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) అద్భుతంగా ఆడారు. నాలుగో వికెట్ కు 99 పరుగులు జోడించారు.

విజయానికి చేరువైన సమయంలో రింకూ సింగ్ రనౌట్ అయినా.. నితీశ్ రాణా అజేయంగా నిలిచి కోల్ కతా కు విజయాన్ని అందించాడు. 145 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ 18.3 ఓవర్లలోనే చేధించింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రింకూ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News