Jagapathi Babu: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కార్పొరేషన్లలో మేయర్ల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీ పడుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు విపక్ష పార్టీ నేతలు ప్రచారంలో దూసుకు పోతున్నారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో కొంతమంది టాలీవుడ్ స్టార్స్ రంగంలోకి దిగేశారు. మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా చెల్లికి ఓటు వేసి గెలిపించాలని గుంటూరు నగర ఓటర్లకు నటుడు జగపతిబాబు విజ్ఞప్తి చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులకు తమకు తెలిసినవారిని రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. అభ్యర్థుల తరపున సినీ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు వీడియోలు రిలీజ్ చేస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి నేత కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు నటుడు జగపతిబాబు మద్దతు తెలిపారు. అపర్ణను తన సోదరిగా పేర్కొన్న ఆయన, నా చెల్లి సమర్థురాలని, నగర అభివృద్ధి కోసం ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నగర ప్రజలకు నా విన్నపం అంటూ జగపతిబాబు వీడియోలో ప్రస్తావించారు. ప్రజలు తెలివైనవారని, సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించినట్లు లక్ష్మీ అపర్ణను గెలిపించాలని కోరారు. నా చెల్లికి మంచి మనసు ఉందని వివరించారు. గుంటూరుకు మంచి చేస్తుందని మనసులోని మాట బయటపెట్టారు. ఆమెతోపాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నటుడు జగపతిబాబు.
ALSO READ: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!
ఇటు కూటమి, అటు వైసీపీ తరపున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. గడిచిన రెండురోజులు అర్నబ్ తుఫాను నేపథ్యంలో సైలెంట్ అయ్యారు. ప్రచారానికి శుక్రవారం చివరిరోజు కావడంతో ఉదయం నుంచి అభ్యర్థుల తరపు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అటు మున్సిపాలిటీల్లో ఇదే జోరు కొనసాగుతోంది.
నా చెల్లిని మేయర్గా గెలిపించండి: జగపతిబాబు
గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ నాయకురాలు కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు నటుడు జగపతిబాబు మద్దతు తెలిపారు. అపర్ణను తన సోదరిగా పేర్కొంటూ.. ఆమె సమర్థురాలని, నగర అభివృద్ధి కోసం ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని… pic.twitter.com/uHxKiEPOtZ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2026