DG Power 27300mAh power bank: ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎక్కడికైనా వెళ్లాలంటే .. ముందుగా గుర్తుకు వచ్చే టెన్షన్ ఫోన్ బ్యాటరీ అయిపోవడం గురించే. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరి దగ్గరా ఒక మంచి పవర్ బ్యాంక్ ఉండటం అవసరమైంది. మార్కెట్లో అందరికీ అందుబాటు ధరలో.. అది కూడా భారీ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఒక ట్రెండింగ్ పవర్ బ్యాంక్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో ఎన్నో రకాల పవర్ బ్యాంకులు లభిస్తున్నప్పటికీ.. తక్కువ బరువుతో, పాకెట్లో పట్టేలా ..చిన్నగా ఉంటూ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వాటికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఈ మోడల్ పవర్ బ్యాంక్. చూడటానికి చాలా కాంపాక్ట్‌గా ఉండే ఈ పవర్ బ్యాంక్, మీ మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేసే శక్తిని కలిగి ఉంటుంది.
సాధారణంగా 25వేలకు పైగా mAh కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకుల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుత ఈ-కామర్స్ ఆఫర్లలో భాగంగా ఈ డివైజ్ కేవలం రూ. 571 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. కేవలం ఆరు వందల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్‌లో ఇంత భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న.. పవర్ బ్యాంక్ దొరకడం నిజంగా నమ్మశక్యం కాని విషయమే. బడ్జెట్ యూజర్లకు ఇది ఒక సరి కొత్త రికార్డ్ ఆఫర్ అని చెప్పొచ్చు.
ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో MagSafe సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల అనుకూలమైన ఫోన్‌లకు వైర్‌తో సంబంధం లేకుండా ఈజీగా అటాచ్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇది పాకెట్ సైజ్‌లో ఉండటంతో మీ పాకెట్‌లో లేదా చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీని మోడర్న్ లుక్ చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
Also Read: 45% డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు
సమయం తక్కువగా.. ఉన్నప్పుడు ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. ఇది మీ స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్ లేదా ఇతర చిన్న గాడ్జెట్ లను వేగంగా ఛార్జ్ చేస్తుంది. అలాగే ఇందులో.. ఉండే మల్టిపుల్ అవుట్ పుట్ పోర్ట్స్ ద్వారా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజెస్‌ను కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ వాడుతున్నప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఇందులో లేటెస్ట్ స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ , ఓవర్‌చార్జింగ్ నుంచి మీ ఫోన్‌ను కాపాడుతుంది. అంతే కాకుండా తక్కువ పవర్ తీసుకునే ఇయర్ బడ్స్ లేదా స్మార్ట్ వాచ్‌ల కోసం ప్రత్యేకమైన లో-చార్జింగ్ మోడ్ కూడా ఇందులో పని చేస్తుంది.
మొత్తంగా చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ , మ్యాగ్‌సేఫ్ ఫీచర్ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం రూ.571 ధరలో లభిస్తున్న ఈ ట్రెండింగ్ గాడ్జెట్ కొనడం ద్వారా ప్రయాణాల్లో బ్యాటరీ టెన్షన్‌కు పూర్తిగా చెక్ పెట్టొచ్చు!