Bosch 7kg front load washing machine: ప్రస్తుత కాలంలో ఇంట్లో ..ఒక మంచి వాషింగ్ మెషీన్ ఉండటం చాలా అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు 7 కేజీ కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. మార్కెట్లో చాలా రకాల వాషింగ్ మెషీన్ బ్రాండ్లు ఉన్నప్పటికీ, జర్మన్ టెక్నాలజీతో తయారయ్యే బోష్ బ్రాండ్‌కు ఉండే క్రేజే వేరు. దానిలోనూ ఈ మోడల్ దాని అద్భుతమైన పని తీరుతో కస్టమర్ల మనసు దోచుకుంటోంది. అంతే కాకుండా వైట్ కలర్ లుక్‌తో వచ్చే ఈ మెషీన్ మీ ఇంట్లో పెట్టినా మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర మార్కెట్లో సుమారు రూ.48,990 వరకు ఉంటుంది. అయితే.. ప్రస్తుత ప్రత్యేక ఆఫర్లు , సేల్స్ ప్రకారం ఇది దాదాపు 45 శాతం వరకు భారీ తగ్గింపుతో కేవలం రూ.26,990 ధరకే అందుబాటులోకి వస్తోంది. ఇంత తక్కువ ధరకు జర్మన్ టెక్నాలజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ దొరకడం నిజంగా గొప్ప అవకాశమనే చెప్పాలి. బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ మోడల్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో ఇన్-బిల్ట్ హీటర్ వస్తుంది. దీని వల్ల వేడి నీటితో బట్టలు ఉతకడానికి వీలవుతుంది. చలికాలంలో లేదా వర్షాకాలంలో బట్టలపై ఉండే మొండి మరకలు, జిడ్డు ఈజీగా వదిలిపోతాయి. అంతేకాదు.. వేడి నీటి వాష్ వల్ల బట్టలపై ఉండే 99.9% బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. ఇది చిన్న పిల్లలు ఉన్న ఇళ్లకు ఎంతో ఉపయోగ పడుతుంది.
చాలా మందికి వాషింగ్ మెషీన్ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయం ఉంటుంది. కానీ ఈ బోష్ మెషీన్ 5-స్టార్ ఎనర్డీ రేటింగ్తో వస్తుంది. అంటే ఇది చాలా తక్కువ కరెంట్ , నీటిని ఖర్చు చేస్తుంది. ఇందులో ఉండే AI ActiveWater Plus టెక్నాలజీ బట్టల బరువును బట్టి నీటి వాడకాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీని వల్ల వాటర్ వేస్ట్ అయ్యే ప్రసక్తే ఉండదు.
Also Read: పండగ ఆఫర్లో..రూ.15వేలలోపే 43 ఇంచుల టీవీ,డోంట్ మిస్
బిజీ లైఫ్‌లో ఉన్నవారికి సమయం చాలా విలువైంది. అందుకే ..ఇందులో SpeedPerfect అనే ప్రత్యేక ఫీచర్ ఇచ్చారు. ఇది సాధారణ వాషింగ్ టైమ్‌ను దాదాపు 65 శాతం వరకు తగ్గిస్తుంది. అయినప్పటికీ బట్టలు మాత్రం ఎంతో శుభ్రంగా ఉతుకుతాయి. అలాగే ఇందులో ఉండే మోటార్ చాలా నిశ్శబ్దంగా పని చేస్తుంది. ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా ఇది రన్ అవుతుంది కాబట్టి రాత్రి సమయంలో కూడా ఎలాంటి సౌండ్ లేకుండా బట్టలు ఉతుక్కోవచ్చు.
మొత్తంగా చూస్తే.. మీ బడ్జెట్‌లో నమ్మదగిన, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. లేటెస్ట్ ఫీచర్లు ఉన్న వాషింగ్ మెషీన్ కోసం వెతుకుతుంటే.. ఈ మోడల్ నిస్సందేహంగా కొనొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకుంటే మీ డబ్బు ఆదా అవ్వడంతో.. పాటు మీ బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి.