OnePlus Nord CE5: వన్‌ప్లస్ ఎప్పుడూ కొత్త ఫోన్ తీసుకొస్తే వినియోగదారుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతుంది. కారణం, అందుబాటులో ఉండే ధరలో అందించే ప్రీమియం అనుభవం. ఈసారి వారు తీసుకొచ్చింది వన్‌ప్లస్ నార్డ్ సిఈ5. దాని డిజైన్, కెమెరా పనితీరు ప్రతీ అంశంలోనూ ఇది నిజంగా నార్డ్ సిరీస్‌కే సరిగ్గా సరిపోయే అప్‌గ్రేడ్” అనిపిస్తుంది. మరి ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, నిజంగా ఇది సరైన ఎంపిక అవుతుందా? అన్నది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
స్మూత్ డిజైన్
ముందుగా డిజైన్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ చాలా సన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. నీలం, నలుపు, తెలుపు ఈ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. వెనుక భాగంలో కొత్త స్టైల్‌లో రూపొందించిన పెద్ద కెమెరా సెటప్ ఉండటం ఫోన్ లుక్‌కి మరింత ప్రత్యేకతను తెచ్చింది.
అమోలెడ్ పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇది 6.7 అంగుళాల అమోలేడ్ ఎఫ్‌హెచ్‌డి ప్లస్ స్క్రీన్‌తో వస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. హెచ్‌డిఆర్ సపోర్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. స్క్రీన్ చుట్టూ ఉన్న అంచులు చాలా సన్నగా ఉండటంతో, ఫోన్ డిస్‌ప్లే మరింత వెడల్పుగా అనిపించి వీడియోలు చూడటానికి మరింత అనుభవాన్నిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 7 జెన్ సిరీస్ ప్రాసెసర్
ఈ ఫోన్ పనితీరు చూస్తే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ సిరీస్ ప్రాసెసర్‌ని వాడారు. ఈ ప్రాసెసర్ గేమింగ్, మల్టీటాస్కింగ్ రెండింటికీ సరిపోతుంది. బిజిఎంఐ, సిఓడి మొబైల్ లాంటి భారీ గేమ్స్ కూడా లాగ్ లేకుండా ఆడవచ్చు. ఆక్సిజన్ ఓఎక్స్ వన్‌ప్లాస్‌కి ఎప్పటిలాగే శుభ్రంగా, వేగంగా ఉంటుంది, అనవసరమైన యాప్‌లు చాలా తక్కువగా ఉంటాయి. అదనంగా ఒనఫ్లస్ ఏఐ ఫీచర్లు కూడా ఇచ్చారు, ఇవి ఫోటోగ్రఫీ, వాయిస్ రికగ్నిషన్ లాంటి వాటికి ఉపయోగపడతాయి. అంటే సాఫ్ట్‌వేర్ మనం మాట్లాడిన మాటలను విని వాటిని అర్థం చేసుకోవడం లాంటి పనులు కూడా చాలా సులభంగా చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
Also Read: Kantara Chapter 1 Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్… కానీ అసలు పాయింట్ మిస్..!
కెమెరా 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ సెన్సార్
కెమెరా విషయానికి వస్తే, ప్రధానంగా 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ సెన్సార్‌ను అందించారు. పగటి వెలుతురులో చిత్రాలు చాలా స్పష్టంగా, కచ్చితంగా వస్తాయి. తక్కువ వెలుతురులో కూడా రంగులు బాగానే కనిపిస్తాయి. అదనంగా అల్ట్రావైడ్, మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే వాటి పనితీరు సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ముందు భాగంలో 16మెగాపిక్సెల్ కెమెరా ఉండటంతో సెల్ఫీలు, వీడియో కాల్స్ బాగానే వస్తాయి. వీడియోలలో స్టెబిలైజేషన్ బాగా పనిచేయడం వలన కదలికలున్నప్పటికీ సాఫ్ట్‌గా రికార్డు అవుతుంది. అందుకే వీడియోలు తీయడాన్ని ఇష్టపడే వారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.
బ్యాటరీ 5000 ఎంఏహెచ్ సామర్థ్యం
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీని అందించారు. ఒక రోజంతా వాడినా చార్జీంగ్ అయిపోదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదనంగా 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉండటం వల్ల కేవలం 30 నుంచి 35 నిమిషాల్లో 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది వినియోగదారులకు పెద్ద సౌకర్యం అనే చెప్పాలి.
ధర తెలిస్తే షాక్- 2వేలు తగ్గింపు ఛాన్స్
ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రారంభ ధర 22,999రూపాయలు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొంటే 2000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అంటే దాదాపు 20,999రూపాయలకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో ఇంతటి లక్షణాలు కలిపి వస్తే నిజంగా ఎంతో వినియోగదారులకు మంచి లాభమనే చెప్పాలి. ఏకంగా 2వేల ఆదాతో ఇలాంటి ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రావడం పండగ గిఫ్ట్ అనే చెప్పాలి.
వన్‌ప్లస్ నార్డ్ సిఈ5 నిజంగా మంచి ఎంపిక
మొత్తం గా చెప్పాలంటే, వన్‌ప్లస్ నార్డ్ సిఈ5 ఒక పూర్తి స్థాయి స్మార్ట్‌ఫోన్. ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్, 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన కెమెరాలు, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ ఇవన్నీ కలిపి వినియోగదారులకు స్టైలిష్‌గా, నమ్మకంగా ఉపయోగించుకోదగిన ఫోన్‌గా నిలుస్తాయి. ఎక్కువ సేపు నిలిచే బ్యాటరీ కలిగిన ఫోన్ కావాలనుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ సిఈ5 నిజంగా మంచి ఎంపిక అవుతుంది.