Hyderabad:మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శివనగర్ కాలనీలో లక్ష్మీ, రాజయ్య దంపతుల రెండవ కొడుకు శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులను మద్యం కోసం డబ్బులు అడిగాడు. వాళ్లు డబ్బులు లేవని చెప్పడంతో శ్రీనివాస్ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్లను కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.