E-Paper
Advertisement

రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!

రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!
Advertisement

Indian Railways: సాధారణంగా విమాన ప్రయాణం చేసేటప్పుడు లగేజీ బరువు విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. పరిమితికి మించి బరువు ఉంటే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఈ నిబంధన కేవలం విమానాలకే కాదు.. రైల్వేలకు కూడా వర్తిస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందంటే ఎంత లగేజీ అయినా వెంట తీసుకెళ్లవచ్చని భావిస్తుంటారు. కానీ పరిమితి దాటి లగేజీ తీసుకెళ్తే రైల్వే శాఖ భారీగా జరిమానా విధిస్తోంది. టికెట్ ఉన్నా ఈ జరిమానా చెల్లించాల్సిందేనని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏ తరగతిలో ఎంత లగేజీ ఉచితం?

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు ప్రయాణించే క్లాస్‌ను బట్టి ఉచితంగా తీసుకెళ్లే లగేజీ బరువును నిర్ణయించారు. స్లీపర్, థర్డ్ ఏసీ (3AC) ప్రయాణికులు గరిష్టంగా 40 కిలోల వరకు ఉచితంగా లగేజీని తీసుకెళ్లవచ్చు. సెకండ్ ఏసీ (2AC) ప్రయాణికులు 50 కిలోల వరకు తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ఫస్ట్ ఏసీ (1AC) అయితే అత్యధికంగా 70 కిలోల వరకు లగేజీని ఉచితంగా ఉంచుకోవచ్చు. ఈ పరిమితి దాటినట్లయితే ప్రయాణానికి ముందే ఆ అదనపు లగేజీని రైల్వే నిబంధనల ప్రకారం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

పరిమితికి మించి లగేజీ ఉంటే ఏం చేయాలి?

Advertisement

అనుమతించిన లగేజీ కంటే ఎక్కువ ఉంటే ప్రయాణం ప్రారంభించడానికి ముందే రైల్వే స్టేషన్‌లోని ‘లగేజీ ఆఫీస్’కు వెళ్లాలి. అక్కడ నిర్ణీత రుసుము చెల్లించి అదనపు లగేజీని బుక్ చేసుకోవాలి. ఒకవేళ బుక్ చేసుకోకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే సాధారణ రుసుము కంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా ముందే లగేజీని బుకింగ్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: 18 సవర్ల బంగారం.. బిడ్డ, భర్తతో కిడ్నాప్ డ్రామా.. ‘లేడీ డాన్’ ప్లాన్ రివర్స్!

తక్కువ లగేజీతోనే ఎంతో బెటర్

Advertisement

ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు తక్కువ లగేజీతో ప్రయాణించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయోవృద్ధులతో కలసి ప్రయాణిస్తున్నప్పుడు లగేజీ విషయంలో మరింత శ్రద్దగా ఉండాలని హితవు పలుకుతున్నారు. రైళ్లల్లో సహజంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సులభంగా మోయగలిగే పరిమాణంలోనే లగేజీని ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైనవి, బరువైన సామాన్లు ఉంటే వాటిని ప్రయాణంలో వెంట మోసుకెళ్లేకంటే రైల్వే ‘పార్శిల్ సర్వీస్’ ద్వారా పంపడమే బెటరని తెలియజేస్తున్నారు.

Also Read: కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

Tags

Related News

ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!

రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి

రైలు టికెట్ రంధ్రాల వెనుక ఇంత కథ ఉందా? చాలామందికి తెలియని ఆసక్తికర నిజం!

తనకు ఎవరూలేరని బాధపడిన వరుడు.. పెళ్లికి 10 వేల మంది అతిథులు సర్‌ప్రైజ్!

రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈశాన్య భారతానికి బుల్లెట్ రైలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. పలు రైళ్లు రద్దు!

Big Stories

Advertisement
×