E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాలకు బంపర్ ఆఫర్.. ఏపీకి 38, తెలంగాణకు 26 లోక్‌సభ స్థానాలు?

తెలుగు రాష్ట్రాలకు బంపర్ ఆఫర్.. ఏపీకి 38, తెలంగాణకు 26 లోక్‌సభ స్థానాలు?
Advertisement

Delimitation Formula: డీలిమిటేషన్ పై మరో కొత్త ఫార్ములా తెరపైకి వచ్చింది. ఇది మల్టీ ఫ్యాక్టర్ ఫార్ములా.. జనాభా ప్రాతిపదిక కాదు.. సీట్లు రెట్టింపు కాదు.. సైంటిఫిక్ ఫార్ములా ఇదే అంటూ తెరపైకి వచ్చింది. టార్గెటెడ్ డీలిమిటేషన్ కరెక్ట్ అంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది.

ఏపీ, తెలంగాణకు జాక్‌పాట్..!

Advertisement

మండలి సభ్యులు రూపొందించిన ఈ విషయం దేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అసలు ఆర్థిక సలహా మండలి ఏం చెప్పిందో వన్ బై వన్ చూద్దాం. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాలను 824 స్థానాలకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ ఫార్ములా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న 25 స్థానాల నుంచి 38 స్థానాలకు పెరుగుతాయి. తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాల నుంచి 26 స్థానాలకు చేరుతాయ్. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయ్. కానీ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి మల్టీ ఫ్యాక్టర్ టార్గెటెడ్ మోడల్ వల్ల నార్త్, సౌత్ రాష్ట్రాల మధ్య లోక్‌సభలో ప్రస్తుతమున్న సీట్ల నిష్పత్తి ఏమాత్రం మారదంటున్నారు. అన్ని పెద్ద రాష్ట్రాల్లో సీట్లు సమానంగా దాదాపు 50 శాతం వరకు పెరుగుతాయ్.

డీలిమిటేషన్‌కు కొత్త ఫార్ములా రెడీ

Advertisement

ఆర్థిక సలహా మండలి చెప్పిందేంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 స్థానాలను ఒకేలా మార్చకుండా, కేవలం 170 పెద్దవి అలాగే ప్రభావవంతమైన నియోజకవర్గాలను మాత్రమే ప్రత్యేకంగా ఎంపిక చేసి వాటిని విభజించాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించబోయే డీలిమిటేషన్ కమిషన్ కేవలం జనాభా పరిమాణం మాత్రమే చూడొద్దని, 5 కీలక సామాజిక-ఆర్థిక అంశాల డేటాసెట్ విశ్లేషణ ఆధారంగా స్థానాలను విభజించాలని ఫార్ములాను ప్రతిపాదించింది. ఒకటి భాషాపరమైన వైవిధ్యం చూడాలి. అంటే నియోజకవర్గంలో మాట్లాడే భాషల ప్రాతిపదికను తీసుకోవాలి.

ఈఏసీ కీలక సూచనలు

సదరు నియోజకవర్గం మెట్రో నగరమా లేదా గ్రామీణ ప్రాంతమా అనే తేడా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా సామాజిక వర్గాల కూర్పును కూడా లెక్కలోకి తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో సగటున ఒక నియోజకవర్గానికి 18.2 లక్షల ఓటర్లు ఉండగా, కొన్ని చోట్ల అది 32 లక్షలు దాటిపోయింది. ఇలాంటి భారాన్ని తగ్గించాలన్నది. నియోజకవర్గాల్లో ఓటరు టర్నవుట్ ఎలా మారుతుందనే లెక్కలు చూడాలంటున్నారు. 2009, 2014, 2019, 2024 ఎన్నికలను విశ్లేషిస్తే చిన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓటింగ్‌ జరుగుతోంది. ఈ లెక్కను ఇక్కడ అప్లై చేయబోతున్నారు.

డీలిమిటేషన్‌పై కొత్త చర్చ

విభజించాలనుకున్న 170 లోక్ సభ సీట్లలో 59 పెద్ద నియోజకవర్గాలను రెండుగా డివైడ్ చేయాలని, 111 స్థానాలను మూడుగా విభజించాలని ప్రతిపాదించారు. ఈ 170 స్థానాలను విభజించడం ద్వారానే మొత్తం లోక్‌సభ సీట్లు 824 కు చేరుకుంటాయి. ఈ ప్రకారం ఆర్థిక సలహా మండలి లిస్టులో తెలుగు రాష్ట్రాల సెగ్మెంట్ల పేర్లను ప్రస్తావించారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్‌లను మూడేసి నియోజకవర్గాలుగా, చేవెళ్లను రెండుగా విభజించాలన్నారు.

హైదరాబాద్‌ను 3 ముక్కలు చేయాలా?

అటు ఆంధ్రప్రదేశ్‌లో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలను మూడుగా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా డివైడ్ చేయాలని సూచించింది. హైదరాబాద్ ను మూడుగా ఎందుకు డివైడ్ చేయాలో లెక్కలతో సహా చెప్పింది ఆర్థిక సలహా మండలి రిపోర్ట్. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడేవారు 10.66 లక్షల మంది ఉన్నారని, మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య 64% అని తెలిపింది. తెలుగు, హిందీ ఇలా రకరకాల భాషలు మాట్లాడే వారు ఉండడంతో మూడుగా డివైడ్ చేయాలన్నారు.

ఓటింగ్ శాతం పెంచే కొత్త ఫార్ములా ఇదే!

మల్టీ ఫ్యాక్టర్ ఫార్ములాతో ఓటింగ్ శాతం పెరుగుతుందని, మెరుగైన ప్రజా ప్రాతినిధ్యం దొరుకుతుందని, అంటే ఒక ఎంపీ 30 లక్షల మందికి జవాబుదారీగా ఉండటం కంటే, 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో మరింత సమర్థవంతంగా వినిపించగలరన్నది రిపోర్ట్. ఎంపీ లాడ్స్ కేటాయింపు ఈజీ అవడం, పట్టణ ఓటర్లు, మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని లెక్కలేస్తున్నారు. సో ఈ రిపోర్ట్ 2027లో జరగబోయే జనాభా గణన తర్వాత ఏర్పాటు కాబోయే అధికారిక డీలిమిటేషన్ కమిషన్‌కు ఈ నివేదిక ఒక దిక్సూచిగా మారనుందంటున్నారు.

Also Read: ఏడాది గడిచినా వీడని మిస్టరీ.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌కు అసలు కారణమేంటి?

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

TSSPDCL లో సరికొత్త రికార్డు.. గత లెక్కలు మించి మరీ విద్యుత్ వినియోగం

Big Stories

Advertisement
×